రాష్ట్ర భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ
ABN, First Publish Date - 2023-06-10T00:21:20+05:30
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారెంటీ అని మాజీ ఎమ్యెల్యే మీనాక్షినాయుడు అన్నారు.
ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం
నిరుద్యోగులకు రూ.3వేలు నిరుద్యోగ భృతి
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు
ఆదోని, జూన్ 9: రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారెంటీ అని మాజీ ఎమ్యెల్యే మీనాక్షినాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా భవిష్యత్తుకు గ్యారెంటీ గోడ పత్రికలను విడుదల చేశారు. అనంతరం మీనాక్షినాయుడు మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన అన్నారు. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని అన్నారు. అంతేగాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్’ ఇచ్చి తాగునీరు అందిస్తామన్నారు. పరిశ్రమలు, కంపెనీలు తేవడం ద్వారా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు యువగళం పథకం కింద కల్పిస్తామని హామీ ఇచ్చారు. కల్పించడం, ఉద్యోగాలు వచ్చే దాకా ప్రతి నెలా రూ.1500 చొప్పున నిరుద్యోగ భృతి అందజేయడం, అన్నదాత పథకం కింద ప్రతి రైతు రూ.20వేల ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిన నారా చంద్రబాబుకు ప్రతి నియోజకవర్గంలో మహిళలు అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, రాష్ట్రంలో 90 శాతం పైగా రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని గుర్తుచేశారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఆత్మహత్యలు 60 శాతానికి పైగా పెరిగాయన్నారు. రానున్న రోజుల్లో వైసీపీకి బుద్ధి చెప్పి టీడీపీ గెలుపునకు అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం టీడీపీ మహానాడులో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉమాపతి నాయుడు, భూపాల్ చౌదరి, రంగస్వామి నాయుడు, బుద్దారెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, దొడ్డనగేరి శివప్ప, కల్లుబావి మల్లికార్జున, యువరాజు, జయరాము పాల్గొన్నారు.
Updated Date - 2023-06-10T00:21:20+05:30 IST