ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘వందే భారత’ స్టాపింగ్‌ ఏదీ...?

ABN, First Publish Date - 2023-10-15T00:04:16+05:30

వందే భారత ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం ఎంతో ఆశతో ఎదురు చూసిన.. డోన నియోజకవర్గ వాసులకు చివరకు నిరాశే మిగిలింది.

డోన రైల్వేస్టేషనలో ఆగని రైలు

డోన నియోజకవర్గ వాసులకు నిరాశ

ఆర్థిక మంత్రి చొరవ చూపాలని విన్నపాలు

డోన, అక్టోబరు 14: వందే భారత ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం ఎంతో ఆశతో ఎదురు చూసిన.. డోన నియోజకవర్గ వాసులకు చివరకు నిరాశే మిగిలింది. ఇక్కడి రైల్వేస్టేషనలో వందే భారత రైలు స్టాపింగ్‌ లేదు. ఇక్కడ రైలు ఆగకపోవడంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వందే భారత రైలు స్టాపింగ్‌ ఉండేలా ఆర్థిక మంత్రి బుగ్గన, రైల్వే ఉన్నతాధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గత ఆదివారం కాచిగూడ-యశ్వంతపూర్‌ వందే భారత ఎక్స్‌ప్రెస్‌ రైలును వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించారు. వందే భారత రైలు డోన రైల్వేస్టేషనలో 15 నిమిషాలు ఆగి వెళ్లిపోయింది. అధునాతన సౌకర్యాలతో ఉన్న వందే భారత రైలు కళ్ల ముందు వెళ్తున్నా ప్రయాణికులకు అందుబాటులో లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ వందేభారత రైలు.. డోనలో నో స్టాపింగ్‌:

కాచిగూడ నుంచి యశ్వంతపూర్‌కు తిరిగే వందేభారత రైలు డోన రైల్వేస్టేషనలో స్టాపింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. దక్షిణమధ్య రైల్వేలో డోన రైల్వేస్టేషనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. డోన మీదుగా దేశంలోని అనేక రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ప్రతి రోజూ దాదాపు 50 రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. రైల్వే జంక్షనగా ఎంతో పేరున్న డోనలో వందే భారత రైలు స్టాపింగ్‌ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాచిగూడ నుంచి బయలుదేరే వందేభారత రైలు కర్నూలు సిటీ రైల్వేస్టేషనలో స్టాపింగ్‌ ఉంది. అక్కడి నుంచి డోన మీదుగా అనంతపురం వెళ్తుంది. ధర్మవరం రైల్వే జంక్షనగా ఉన్నా అక్కడ స్టాపింగ్‌కు అనుమతి ఇచ్చారు. డోన రైల్వేజంక్షనగా ఉన్నప్పటికీ ఇక్కడ స్టాపింగ్‌కు అనుమతివ్వకపోవడంపై నిరసనలు వెలువెత్తుతున్నాయి.

ఫ ప్రతి రైలు ఆగాల్సిందే :

దేశంలోని వివిధ రాష్ట్రాలకు డోన మీదుగా రైళ్ల రాకపోకలు ఉన్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషనలో ప్రతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగాల్సిందే. కొత్తగా పట్టాలెక్కిన వందే భారత ఎక్స్‌ప్రెస్‌ రైలు మాత్రం డోన రైల్వేస్టేషనలో ఆగడం లేదు. కళ్ల ముందు రైళ్లు వెళుతున్నా ప్రయాణీకులు అందులో ఎక్కలేని విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఫ ఆర్థిక మంత్రి చొరవ చూపాలని విన్నపాలు :

డోన రైల్వేస్టేషనలో వందేభారత రైలు స్టాపింగ్‌ ఉండేలా ఆర్థిక మంత్రి బుగ్గన చొరవ చూపాలని జనం నుంచి విన్నపాలు వెలువెత్తుతున్నాయి. డోన రైల్వే పరిధిలో ఉన్న పలు సమస్యలపై ఆర్థిక మంత్రి బుగ్గన అనేకసార్లు దక్షిణ మద్య రైల్వే ఉన్నతాదికారులను కలిసి వినతులు సమర్పించారు. ఆ దిశగానే మంత్రి బుగ్గన డోనలో వందేభారత రైలు ఆగేలా రైల్వే ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న డోనలో వందేభారత రైలు స్టాపింగ్‌ లేకపోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఫ వందేభారత రైలు డోనలో ఆపాలి - రంగనాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి, డోన:

డోన రైల్వేస్టేషనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడి నుంచి నిత్యం వందల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. వందే భారత ఎక్స్‌ప్రెస్‌ రైలు డోన రైల్వేస్టేషనలో ఆపాలి. ఆ దిశగా రైల్వే ఉన్నతాధికారులు, పాలకులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

ఫ ప్రయాణికుల అవసరాలను గుర్తించాలి - ఆలా మోహన రెడ్డి, న్యాయవాది, డోన:

డోన ప్రాంతంలోని ప్రయాణికుల అవసరాలను గుర్తించాలి. ఈ ప్రాంత వాసులు వ్యాపారాల నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్తుంటారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని డోన రైల్వేస్టేషనలో వందేభారత రైలు ఆపేలా రైల్వే ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి.

ఫ జిల్లా కేంద్రంలోనే స్టాపింగ్‌కు అనుమతి ఇచ్చారు - వెంకటేశ్వర్లు, డోన రైల్వేస్టేషన మేనేజర్‌:

ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లోనే వందే భారత రైలు స్టాపింగ్‌కు అనుమతి ఇచ్చారు. ధర్మవరం రైల్వే జంక్షనలో డ్రైవర్లు మారుతున్నందున అక్కడ వందేభారత రైలు స్టాపింగ్‌కు అనుమతిచ్చారు. డోన రైల్వే జంక్షనలో స్టాపింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే గుంతకల్లు రైల్వే డివిజన అధికారులు కోరారు. భవిష్యత్తులో డోన రైల్వేస్టేషనలో వందే భారత రైలు ఆగేందుకు అనుమతి వస్తుందన్న నమ్మకం ఉంది.

Updated Date - 2023-10-15T00:04:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising