ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కార్మిక వ్యతిరేక పార్టీలను గద్దె దించాలి

ABN, First Publish Date - 2023-06-26T00:14:01+05:30

కార్మిక వ్యతిరేక పార్టీలను గద్దె దించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.మునెప్ప పిలుపుని చ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.మునెప్ప

కర్నూలు(న్యూసిటీ), జూన్‌ 25: కార్మిక వ్యతిరేక పార్టీలను గద్దె దించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.మునెప్ప పిలుపుని చ్చారు. ఆదివారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న చట్టాలను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడిదారులకు అను కూలంగా మారుస్తుందని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ లను ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే ఆపాలన్నారు. సీఎం జగన్‌మోహ న్‌రెడ్డి కేవలం పదివేల మందిని మాత్రమే రెగ్యులర్‌ చేస్తామని చెప్ప డం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి జులై 8,9 తేదీల్లో ఒంగోలులో జరిగే యువ మహిళా రాజకీయ శిక్షణ తరగతులను, 10, 11 తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే యువ కార్మికుల రాజకీయ శిక్షణ తరగతు లను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ సమావేశంలో అంగన్‌ వాడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకురాలు జే.లలితమ్మ, నాయకులు అజయ్‌బాబు, ఎన్‌.కృష్ణయ్య, నాగరాజు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising