వలంటీర్లు పాల్గొంటే చర్యలు
ABN, First Publish Date - 2023-08-02T00:02:01+05:30
ఓటరు రీ సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఈ సర్వేలో వలంటీర్లు పాల్గొంచే చర్యలు తీసుకుంటామని నంద్యాల సబ్ కలెక్టరు శ్రీనివాసులు హెచ్చరించారు.
రుద్రవరం, ఆగస్టు 1: ఓటరు రీ సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఈ సర్వేలో వలంటీర్లు పాల్గొంచే చర్యలు తీసుకుంటామని నంద్యాల సబ్ కలెక్టరు శ్రీనివాసులు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని నరసాపురం, నాగులవరం గ్రామాల్లో ఓటరు లిస్టు రీసర్వేను పరిశీలించారు. అనంతరం రుద్రవరం తహసీల్దారు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో 2,447 మంది చనిపోయిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నట్లు ఉత్తర్వులలో ఉన్నాయని తెలిపారు. డివిజన్‌లో డబుల్ ఎంట్రీలు ఉన్నవి 451 ఉన్నాయని చెప్పారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని 134 పోలింగ్ కేంద్రం రిపరిధిలో 2.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 18 నుంచి 19 సంవత్సరాలు వయసు కలిగిన వారు జనాభా ప్రాతిపదికన ఇప్పటి వరకు 1300 మంది ఓటరు నమోదైనట్లు తెలిపారు. మొత్తం ఆరు వేల మందిని కొత్త ఓటరు కింద న మోదు చే యాలన్నారు. ఇంటింటి సర్వేలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎలక్షన్ కమిషన్ కొత్తగా 2024 ఓటరు జాబితా కోసం ఏప్రిల్, జూలై, ఆగస్టు నెలల్లో మూడు సార్లు కొత్త ఓటరు నమోదు కోసం అవకాశం కల్పించిందని తెలిపారు. 2019 బీఎల్‌వోలు చేపట్టిన జాబితాను ప్రస్తుతం బీఎల్‌వోలతో ఇంటింటి సర్వేను చేయించి ఓటర్ల జాబితాను సరి చేస్తున్నామని చెప్పారు. ఈ సర్వే ఆగస్టు 21 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆయన వెంట తహసీల్దారు రవీంద్రప్రసాద్, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:02:01+05:30 IST