ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆవుల మందపై పెద్దపులి దాడి

ABN, First Publish Date - 2023-07-21T23:25:04+05:30

ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామం నుంచి శుక్రవారం మేతకు వెళ్ళిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఓ ఆవు మృతి చెందింది.

ఆత్మకూరు రూరల్‌, జూలై 21: ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామం నుంచి శుక్రవారం మేతకు వెళ్ళిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఓ ఆవు మృతి చెందింది. కొట్టాల చెరువు గ్రామానికి చెందిన గురువయ్య అనే కాపరి ఆవుల మందను తీసుకుని శుక్రవారం నల్లమల అడవిలో మేపేందుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో ఒక ఆవు అక్కడిక్కడే మృతి చెందింది. కాగా అక్కడి కుక్కలు మొరగడంతో పులి ఆవును వదిలేసి వెళ్లి పోయిందని కాపరి తెలిపారు. అలాగే చిన్న అనే మరో పశువుల కాపరి గురువారం ఆవుల మందతో అడవిలోకి వెళ్లి అనారోగ్యంగా ఉన్న ఓ ఆవును చెట్టుకు కట్టేసి మిగిలిన ఆవులను మేపేందుకు తోలుకొని వెళ్ళాడు. తిరిగి వచ్చి చూసేసరికి చెట్టుకు కట్టేసిన ఆవు కనిపించలేదు. శుక్రవారం దాని కోసం నల్లమలలో గాలించారు. ఓ ప్రాంతంలో ఆవు కళేబరం లభించింది. అక్కడ పెద్దపులి అడుగు జాడలు కనిపించాయి. ఈ వివరాలను అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

Updated Date - 2023-07-21T23:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising