సహకరించిన వారిపై కూడా పోక్సో కేసు
ABN, First Publish Date - 2023-06-07T00:01:10+05:30
ప్రేమ, పెళ్లి మొదలైన పేర్లతో బాలికలకు అన్యాయం చేసేవారికి సహకరించిన వారి మీద కూడా పోక్సో కేసు నమోదు చేస్తామని ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు.
ముగ్గరిపై కేసు నమోదు
సహకరించిన కారు డ్రైవర్‌ను గాలిస్తున్నాం
ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి
ఆదోని రూరల్, జూన06ః ప్రేమ, పెళ్లి మొదలైన పేర్లతో బాలికలకు అన్యాయం చేసేవారికి సహకరించిన వారి మీద కూడా పోక్సో కేసు నమోదు చేస్తామని ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. మంగళవారం స్ధానిక తాలుకా పోలీస్ స్ట్టేషనలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 30వ తేది రాత్రి ఓ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక మెడికల్ దుకాణానికి వెళతానని బయటకు వెళ్లిందని, రాత్రింత ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి 31వతేదిన పెద్దతుంబళం పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. బాలిక పక్కింట్లో ఉన్న వివాహితుడి మీద అనుమానంతో ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ నెల 2న నిందితుడు బాలికను కంబయ్య కట్ట వద్ద వదిలేసి వెళ్లినట్లు సమాచారం వచ్చిందని అన్నారు. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు.. అ రోజు రాత్రి నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేసుకొని, అత్యాచారం చేశాడు. నిందితుడితోపాటు మరో ఇద్దరు తనను కారులో కర్ణాటకకు తీసుకెళ్లారని బాలిక తెలిపింది. కేసు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను సోమవారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం సింధనూరు తాలుకా అయనూరు గ్రామ సమీపంలో పంపుహౌస్ దగ్గర అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులకు సహకరించిన కారు డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ముందు బాలికను చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పాజెప్పామని, ఆ తర్వాత బాలిక ఇష్టం మేరకు తల్లిదండ్రుల దగ్గర వదిలామని తెలిపారు.
Updated Date - 2023-06-07T00:01:10+05:30 IST