ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కర్నూలు యార్డులో రైతుల సమస్యలకు చెక్‌

ABN, First Publish Date - 2023-09-21T23:41:19+05:30

కర్నూలు మార్కెట్‌ యార్డులో ఇప్పటిదాకా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపారు.

ఫ గ్రేడింగ్‌తో పాటు ప్యాకింగ్‌ మిషన ఏర్పాటు

కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 21: కర్నూలు మార్కెట్‌ యార్డులో ఇప్పటిదాకా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపారు. కర్నూలు యార్డులో రూ.57 లక్షలతో ఏర్పాటు చేసిన మల్టి కమాడిటి గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ మిషనను మార్కెటింగ్‌ శాఖ జేడీ రామాంజినేయులు, జిల్లా అగ్రి ట్రేడ్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సుబ్బారెడ్డితోపాటు సెలక్షన గ్రేడ్‌ సెక్రటరీ గోవిందు ఆధ్వర్యంలో గురువారం వాము గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ మిషనను ట్రయల్‌ రన నిర్వహించారు. కర్నూలు మార్కెట్‌ యార్డుకు ఏపీ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వామును రైతులు పెద్దఎత్తున విక్రయానికి తీసుకుని వస్తున్నారు. ఇప్పటిదాకా తూకం విషయంలోనూ ఇతరత్రా కారణాలతో తాము నష్టపోతున్నామనీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకపై ఆ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా కర్నూలు యార్డులో మల్టీ కమాడిటి గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ మిషనను ఏర్పాటు చేశామని సెలక్షన గ్రేడ్‌ సెక్రటరీ గోవిందు తెలిపారు. ఈ మిషన ద్వారా వాము, జొన్నలు, శనిగలు, కొర్రలు, కందులు, ఆముదాలు, మొక్కజొన్నలు గ్రేడింగ్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు సెక్రటరీలు రెహిమాన, వెంకటేశ, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, శివన్న, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:41:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising