ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెప్పలపై కృష్ణస్వామి విహారం

ABN, First Publish Date - 2023-06-01T01:59:53+05:30

శ్రీవారి దేవేరి,తిరుచానూరు పద్మావతీ దేవి తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడు పద్మసరోవరంలో తెప్పలపై విహరించారు.

పద్మసరోవరంలో తెప్పలపై విహరిస్తున్న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రారంభమైన పద్మావతీ దేవి తెప్పోత్సవాలు

తిరుచానూరు, మే 31: శ్రీవారి దేవేరి,తిరుచానూరు పద్మావతీ దేవి తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడు పద్మసరోవరంలో తెప్పలపై విహరించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు బుధవారం మధ్యాహ్నం కేటీ మండపంలో శ్రీకృష్ణస్వామికి నేత్రపర్వంగా అభిషేకాలు జరిగాయి. సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామిని పద్మసరోవరానికి వేంచేపు చేసి తెప్పలపై కొలువుతీర్చారు. ఉభయదేవేరులతో స్వామివారు పద్మసరోవరంలో మూడు పర్యాయాలు విహరించారు. గురువారం సాయంత్రం సుందరరాజస్వామిగా విహరించనున్నారు. చివరి మూడు రోజులు పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. శనివారం గజవాహనం, ఆదివారం గరుడవాహన సేవ జరగనున్నాయి.డిప్యూటీ ఈవో గోవిందరాజన్‌, ఏఈవో ప్రభాకర రెడ్డి, ఏవీఎస్వో శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising