సింగిల్ డిజిట్‌కే వైసీపీ పరిమితం: బొమ్మసాని సుబ్బారావు
ABN, First Publish Date - 2023-10-03T00:58:40+05:30
రాష్ట్రంలో జగన్ నియంతృత్వ పోకడల కారణంగా ఈసారి ఎన్నికల్లో వైసీపీ కేవలం తొమ్మిది సీట్లకు పరిమితం కావడం ఖాయమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు జోస్యం చెప్పారు.
గొల్లపూడి: రాష్ట్రంలో జగన్ నియంతృత్వ పోకడల కారణంగా ఈసారి ఎన్నికల్లో వైసీపీ కేవలం తొమ్మిది సీట్లకు పరిమితం కావడం ఖాయమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు జోస్యం చెప్పారు. బొమ్మసాని నివాసంలో సోమవారం నిర్వహిం చిన దీక్షలో 500 మంది పైగా ప్రజలు పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు కాజ రాజ్ కుమార్ దండలు వేసి నిరహార దీక్షను ప్రారంభించారు. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టుల సాయంతో ఓట్లు చీలకుండా చూసి వైసీపీ దుర్మార్గ పాలనను అంతమొందిస్తామని సుబ్బారావు అన్నారు. చెన్నుబోయిన చిట్టిబాబు, కొండపల్లి మాజీ సర్పంచ్ కొల్లి వెంకటే శ్వరరావు దీక్షను విరమింపజేశారు. మల్లెల శ్రీనివాస చౌదర్, అబ్దుల్‌ఖాదర్, గూడపాటి కృష్ణప్రసాద్, చిగురు పాటి శంకరరావు, వడ్లమూడి బ్రహ్మయ్య, నూతులపాటి శివరాం, దిరిశం నాగేశ్వరరావు, కరింకొండ బాలాజీ, రాయల లీలాప్రసాద్, జనసేన పార్టీ నేత కటకం ధర్మారావు, సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
Updated Date - 2023-10-03T00:58:40+05:30 IST