ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా కార్పొరేటర్‌ ఎక్కడ..?

ABN, First Publish Date - 2023-03-05T00:36:38+05:30

తమ డివిజన్‌ కార్పొరేటర్‌ను చూసి చా లా కాలమైందని, సమస్యలను గాలికి వదిలేశారంటూ 64వ డివిజన్‌ రా ధానగర్‌ వాసులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాయకాపురం, మార్చి 4 : తమ డివిజన్‌ కార్పొరేటర్‌ను చూసి చా లా కాలమైందని, సమస్యలను గాలికి వదిలేశారంటూ 64వ డివిజన్‌ రా ధానగర్‌ వాసులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయకాపురం రాధానగర్‌ ప్రాంతంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం జరిగింది. ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకునే క్రమంలో స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే ముందు పెట్టారు. డివిజన్‌లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, కాలువల్లో పూడిక తీసి ఆరునెలలైందని, ఎమ్మెల్యే వస్తున్నాడని ఈరోజు తీశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రోజుల నుంచి మంచినీరు రావడం లేదని ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని డివిజన్‌ కార్పొరేటర్‌ సమస్యలను గాలికి వదిలేశారని ఫిర్యాదు చేశారు. అలాగే మీరు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఎన్నికలప్పుడు వచ్చారని, మళ్లీ ఇప్పుడు చూస్తున్నామంటూ విమర్శించారు. మరో మహిళ తనకు ఏ ప్రభుత్వ పథకం రావడం లేదని, ఐటీ రిటర్న్స్‌ ఉన్నాయంటూ పథకాలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ పేరుతో ఐటీ రిటర్న్స్‌ ఏమి లేవని రూ.2వేలు ఖర్చుపెట్టించి 26(ఏ) ఫారం తెప్పించి సచివాలయ సిబ్బందికి అందజేస్తే కొన్ని రోజుల తర్వాత ఫారాలు పోయాయని మళ్లీ తేవాలని వేధిస్తున్నట్టు ఎమ్మెల్యేకు మెరపెట్టుకుంది. మహిళ గోడు విన్న ఎమ్మెల్యే పథకాలు రావాలంటే తిరగాలని బద్ధకంగా వెళ్తే ఎలా అని ఎదురు ప్రశ్నించడంతో మహిళ మరింత ఆగ్రహానికి గురై అసహనం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-03-05T00:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising