ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలి
ABN, First Publish Date - 2023-07-21T00:29:15+05:30
పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలని సీఐటీయూ అనుబంధ ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు
ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలి
సీఐటీయూ నేత
బాబూరావు
గవర్నర్‌పేట, జూలై 20: పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలని సీఐటీయూ అనుబంధ ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రెండేళ్లకు ఒకసారి పెంచే కూలి రేట్లు గడిచిన జూన్ ఒకటి నుంచి పెరగాల్సి ఉండగా తమ నోటీసులు యాజమాన్యాలకు అందజేసినా చర్చలకు పిలవకపోవడాన్ని నిరసిస్తూ గురువారం యూనియన్ ఆధ్వర్యంలో గవర్నర్‌పేట ఆలీబేగ్ వీధిలో కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు సీహెచ్ బాబూరావు, ముఠా సంఘం నేతలు ఎం. బ్రహ్మయ్య, ఎం. సీతారాములు మాట్లాడుతూ కూలి రేట్లు న్యాయంగా పెంచమని కోరుతున్నామని, యాజమాన్యాలు చర్చలకు పిలవకపోవడంతో నిరసన చేయాల్సి వస్తోందని తెలిపారు. గవర్నర్‌పేట ఆలీబేగ్ వీధి, పాత బస్టాండ్, బకింగ్‌హంపేట పోస్టాఫీసు, బీసెంటు రోడ్డు, జైహింద్ కాంప్లెక్ మీదుగా ఎన్‌టీఆర్ కాంప్లెక్స్ వరకు ర్యాలీ జరిగింది. సీఐటీయూ నాయకులు ఎంవీ సుధాకర్, కె. దుర్గారావు, ఈవీ నారాయణ చౌదరి, ముఠా సంఘం నాయకులు నర్సింహులు, ఎల్. వెంకట్రావు, శ్రీరాములు రెడ్డి, వెంకటరెడ్డి, ముఠా మేస్త్రీలు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T00:29:15+05:30 IST