ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహిత అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2023-06-07T00:48:59+05:30

చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని చలివేంద్రపాలెం లో మంగళవారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలివేంద్రపాలెం (కంకిపాడు), జూన్‌ 6 : చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని చలివేంద్రపాలెం లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరు మండలం గోసాల గ్రామానికి చెందిన వణు కూరు సురేష్‌ కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు (28) ఏనిమిదేళ్ల క్రితం చలి వేంద్రపాలెంకు చెందిన దేవరపల్లి నాగవంశీతో వివాహం జరిగింది. కొంత కాలం సంసారం సాఫీగా సాగింది. ఇటీవల భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 2న మళ్లీ గొడవ జరగడం అది లక్ష్మీ ప్రసన్న తమ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది. కొంత సేపటి తరువాత వారు వెళ్లి చూడగా ఇంట్లో దూలానికి వేలాడుతూ కనిపించింది. హుటా హుటిన ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం పోరంకిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రసన్న మంగళవారం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె తండ్రి సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగవంశీ, అతని తండ్రిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై కె. సుధాకర్‌ తెలిపారు.

Updated Date - 2023-06-07T00:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising