వైభవంగా నాంచారమ్మ జాతర
ABN, First Publish Date - 2023-03-08T00:53:20+05:30
విశ్వనాథపల్లి అద్దంకి నాంచారమ్మ జాతర మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది.
కోడూరు, మార్చి 7 : విశ్వనాథపల్లి అద్దంకి నాంచారమ్మ జాతర మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు విచ్చేసి కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి పాలపొంగళ్లు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. సంతానం కోరుతూ కొందరు మహిళలు పానాచారాలు చేశారు. ఆలయ అర్చకులు పార్థసారధి అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు అమ్మవారిని దర్శించుకున్నారు. అవనిగడ్డ డిఎస్పీ మెహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఆలయం వద ్ద ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు. కూచిభొట్ల సత్యనాగేశ్వర శాస్త్రి, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, కోట నాంచారమ్మ ఆర్థిక సౌజన్యంతో ఆరు వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారుల ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఏర్పాట్లను ఈవో పామర్తి సీతారామయ్య, ఆలయ ఛైర్మన్ ముప్పిరిశెట్టి శ్రీనివాసరావు, అవనిగడ్డ సీఐ జి.శ్రీనివాస్, కోడూరు ఎస్సై నాగరాజు, ఎంపీపీ కొండవీటి వెంకట కుమారి, గ్రామసర్పంచ్ కొప్పనాతి శేషుబాబు పర్యవేక్షించారు. మండల జనసేన పార్టీ నాయకులు తోట సోమశేఖరరావు మిత్ర బృందం ఆధ్వర్యంలో విశ్వనాథపల్లి భక్తులకు మజ్జిగ పంపిణీ చేపట్టగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ప్రారంభించారు. బండ్రెడ్డి రామకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు మర్రె గంగయ్య, కొండవీటి సునీత, లంకే యుగంధర్, ఉల్లి శేషగిరిరావు, బడే వెంకటేశ్వరరావు, కనగాల వెంకటేశ్వరరావు, గాజుల శంకరరావు, బాసు నాంచారయ్య నాయుడు, గుడివాక శేషుబాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెదప్రోలులో...
మోపిదేవి : పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం వైభవంగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకున్నారు. నూతన వధూవరులు సంతా నం కోసం అమ్మవారి సన్నిధిలో ఊయల ఊపి ముడుపులు కట్టారు. అమ్మవారిని గ్రా మ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. చల్లపల్లి సీఐ బి.బి.రవికుమార్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆకుల వెంకట్రామయ్య, కుర్రా గురుప్రసాద్, కెవి.ఎన్.కె.కోటేశ్వరరావులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షించారు. అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ, పులిహోర పంపిణీ చేశారు. మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, ప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి, అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షురాలు బండే కనకదుర్గ, ప్రధాన కార్యదర్శి మోర్ల జయలక్ష్మి, విశ్వనాథపల్లి పాప తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
Updated Date - 2023-03-08T00:53:20+05:30 IST