లింగనిర్ధారణ యంత్రాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
ABN, First Publish Date - 2023-06-11T01:12:36+05:30
అనుమతుల్లేకుండా లింగనిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వరంగల్ కమిషనరేట్‌లోని కేయూ, దామెర పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.25లక్షల విలువ చేసే ఆరు పోర్టబుల్, 12 ఫిక్స్‌డ్ స్కానింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
హనుమకొండ క్రైం, జూన్ 10 : అనుమతుల్లేకుండా లింగనిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వరంగల్ కమిషనరేట్‌లోని కేయూ, దామెర పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.25లక్షల విలువ చేసే ఆరు పోర్టబుల్, 12 ఫిక్స్‌డ్ స్కానింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన మల్లిపూడి అశోక్‌కుమార్, నెల్లూరు జిల్లా కావలికి చెందిన తాతపూడి కిరణ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. శనివారం వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. మల్లిపూడి అశోక్‌కుమార్ విజయవాడలో 2012 నుంచి ఎబిలిటీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంజనీర్‌గా ఈసీజీ అలా్ట్ర సౌండ్ యంత్రాల మరమ్మతులు చేసేవాడు. విజయవాడ అజిత్‌నగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని ఆస్ర్టానిక్ టెక్నాలజీ పేరుతో బయోమెడికల్ ఎక్వి్‌పమెంట్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. చెన్నై నుంచి పాత స్కానర్లను బల్క్‌గా కొనుగోలు చేసి అవసరం ఉన్నవారికి ఎలాంటి అనుమతుల్లేకుండా ఎక్కువ ధరకు విక్రయించేవాడు. ప్రవీణ్‌కు రెండేళ్ల కిందట ఒక పోర్టబుల్ స్కానర్ విక్రయించాడు. ప్రవీణ్ పోలీసులకు పట్టుబడటంతో లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానర్ కొనుగోలు చేసిన వ్యక్తి అడ్రస్ చెప్పాడు. అమ్మడానికి సిద్ధం చేసిన నాలుగు పోర్టబుల్, 11 ఫిక్స్‌డ్ స్కానింగ్ యంత్రాలను కేయూ పోలీసులు విజయవాడ వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. అశోక్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. గత నెలలో అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న డాక్టర్ సబితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సబిత ఇచ్చిన సమాచారం మేరకు దామెర పోలీసులు నెల్లూరు జిల్లా కావలికి చెందిన తాతపూడి కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. కిరణ్‌కుమార్ కావలిలో పవిత్ర టెక్నాలజీ పేరుతో సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. డాక్టర్ సబితకు రూ.1 లక్షకు స్కానింగ్ యంత్రాన్ని విక్రయించినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు కిరణ్‌కుమార్ నుంచి రెండు పోర్టబుల్, ఒక ఫిక్స్‌డ్ స్కానింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2023-06-11T01:12:57+05:30 IST