ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జలాల కోసం గిరిజనుల ఆందోళన

ABN, First Publish Date - 2023-06-01T00:29:47+05:30

కిడ్నీ వ్యాధి నియంత్రణ కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న కృష్ణా జలాలు మూడు రోజులు సరఫరా చేయకపోవడంతో సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన నిర్వహించారు.

చీమలపాడు పెద్దతండాలో ఆందోళన చేస్తున్న గిరిజన మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎ.కొండూరు, మే 31 : కిడ్నీ వ్యాధి నియంత్రణ కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న కృష్ణా జలాలు మూడు రోజులు సరఫరా చేయకపోవడంతో సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నేత పానెం ఆనందరావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించిన కృష్ణా జలాల సరఫరా గిరిజన తండాలకు సక్రమంగా జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చీమలపాడు పెద్దతండాతో మూడు రోజులుగా నీరు సరఫరా కాలేదని, మిగిలిన తండాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. ట్యాంకర్లు ద్వారా సరఫరా చేస్తున్న నీరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్‌ నిండా పోయకుండా బయటకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తక్షణం 15 గిరిజన తండాల్లో కృష్ణా జలాలు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అమ్మిరెడ్డి, మహిళాలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising