ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దార్లకు స్థానచలనం

ABN, First Publish Date - 2023-06-07T00:52:19+05:30

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 24 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ పి.రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలాఖరులో బదిలీల ప్రక్రియ పూర్తికాగా, ఎట్టకేలకు ఉత్తర్వులు విడుదల చేశారు. తహసీల్దార్ల బదిలీల్లో కొందరు అధికారులు తమదైనశైలిలో వ్యవహరించి తెరవెనుక చక్రం తిప్పారనే ఆరోపణలున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి తహసీల్దార్ల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి. - ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లాలో..

కృష్ణాజిల్లాలో 12 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. బందరు ఆర్డీవో కార్యాలయ ఏవోగా పనిచేస్తున్న బి.నెల్సన్‌పాల్‌ బాబును ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయ ఏవోగా, ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయ ఏవోగా పనిచేస్తున్న కేజీఎన్‌ సోమేశ్వరరావును బందరు ఆర్డీవో కార్యాలయ ఏవోగా నియమించారు. కలెక్టరేట్‌లో ఎల్‌పీడబ్ల్యూడీ స్పెషల్‌ తహసీల్దార్‌గా పనిచేస్తున్న కె.సత్యసులోచనను గుడివాడ ఆర్డీవో కార్యాలయ ఏవోగా నియమించారు. గుడివాడ ఆర్డీవో కార్యాలయ ఏవోగా పనిచేస్తున్న బి.శ్రీనునాయక్‌ను కలెక్టరేట్‌ ఎల్‌ఏపీడబ్య్లూడీ పథకం స్పెషల్‌ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. కలెక్టరేట్‌లో ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ స్పెషల్‌ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఏఎస్‌ఎన్‌ రాధికను ల్యాండ్స్‌ విభాగం సూపరింటెండెంట్‌గా నియమించారు. బాపులపాడు తహసీల్దార్‌గా పనిచేస్తున్న టి.మల్లికార్జునరావును కలెక్టరే ట్‌లోని ల్యాండ్‌ రీఫార్మ్స్‌ విభాగం తహసీల్దార్‌గా నియమించారు. కంకిపాడు తహసీల్దార్‌గా పనిచేస్తున్న టీవీ సతీష్‌ను కలెక్టరేట్‌లోని ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ స్పెషల్‌ తహసీల్దార్‌గా నియమించారు. మంగళగిరి సీసీఎల్‌ఏ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ జిల్లాలో తహసీల్దార్‌గా శిక్షణ పొందిన ఎం.కుసుమకుమారిని తోట్లవల్లూరు తహసీల్దార్‌గా నియమించారు. తోట్లవల్లూరు తహసీల్దార్‌గా పనిచేస్తున్న కె.వెంకటశివయ్యను పెనుమలూరు తహసీల్దార్‌గా నియమించారు. సెలవులో ఉండి పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న పీఎన్‌వీ ప్రసాద్‌ను కంకిపాడు తహసీల్దార్‌గా నియమించారు. మచిలీపట్నం తహసీల్దార్‌ డి.సునీల్‌బాబును బాపులపాడు తహసీల్దార్‌గా నియమించారు. మంగళగిరి సీసీఎల్‌ఏ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ జిల్లాలో తహసీల్దార్‌ శిక్షణ పొందిన ఎం.శ్రీవిద్యను మచిలీపట్నం తహసీల్దార్‌గా నియమించారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో..

ఎన్టీఆర్‌ జిల్లాలో 10 మంది తహసీల్దార్లను బదిలీచే స్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. విజయవాడ నార్త్‌తహసీల్దార్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ను కలెక్టరేట్‌ లోని కో-ఆర్డినేషన్‌ విభాగానికి బదిలీ చేశారు. కలెక్టరేట్‌లోని కో-ఆర్డినేషన్‌ విభాగం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బి.ఆశయ్యను వీరులపాడు తహసీల్దార్‌గా నియమించారు. వీరులపాడు తహసీల్దార్‌గా పనిచేస్తున్న శంకర బాబును కంచికచర్ల తహసీల్దార్‌గా బదిలీ చేశారు. కంచికచర్ల తహసీల్దార్‌గా పనిచేస్తున్న వి.రాజకుమారిని విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ తహసీల్దార్‌గా నియమించారు. విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కేఆర్‌ఆర్‌డీ స్పెషల్‌ తహసీల్దార్‌గా పనిచేస్తున్న డి.చంద్రశేఖర్‌ను విస్సన్నపేట తహసీల్దార్‌గా నియమించారు. విస్సన్నపేట తహసీల్దార్‌ కె.లక్ష్మీని విజయవాడ వెస్ట్‌ తహసీల్దార్‌గా నియమించారు. విజయవాడ వెస్ట్‌లో ఉన్న ఎం.మాధురిని విజయవాడ నార్త్‌కు బదిలీ చేశారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ ఎం.సూర్యారావును జగ్గయ్యపేటకు, సీసీఎల్‌ఏ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసరావును ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌గా నియమించారు. నూజివీడు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న బి.నారాయణను తిరువూరు ఆర్డీవో కార్యాలయ ఏవోగా నియమించారు.

ఏలూరు జిల్లాలో..

తిరువూరు ఆర్డీవో కార్యాలయ ఏవోగా పనిచేస్తున్న కె.రాజ్‌కుమార్‌ను మండవల్లి తహసీల్దార్‌గా, కలిదిండి తహసీల్దార్‌గా పనిచేస్తున్న టి.తేజోమణిని నూజివీడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఏవోగా నియమించారు. వీరంతా ఒకటీ, రెండు రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంది.

Updated Date - 2023-06-07T00:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising