జగ్గయ్యపేటలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్
ABN, First Publish Date - 2023-06-21T00:34:21+05:30
పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.
సిబ్బందికి సూచనలిస్తున్న విజయవాడ ట్రాఫిక్ సీఐ రామచంద్రరావు
జగ్గయ్యపేట, జూన్ 20: పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. కోదాడ రోడ్డులో ఎన్‌ఎస్సీ క్వార్టర్స్ వద్ద తాత్కాలికంగా స్టేషన్‌ను ఏర్పాటు చేసి 10మంది సిబ్బందిని కేటాయించారు. విజయవాడ ట్రాఫిక్ సీఐ రామచంద్రారావును ప్రస్తుతం పేట ట్రాఫిక్ ఇన్‌చార్జిగా నియమించారు. మంగళవారంపట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉన్న 10 ప్రాంతాలను సిబ్బందితో కలిసి గుర్తించారు. త్వరలోనే స్టేషన్‌కు ఎస్సైను నియమిస్తారని చెప్పారు. విజయవాడ సీపీ ఆధ్వర్యంలో త్వరలో స్టేషన్ ను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
Updated Date - 2023-06-21T00:34:21+05:30 IST