ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

ABN, First Publish Date - 2023-09-26T01:59:04+05:30

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేమని వారు లేనిదే ప్రజారోగ్యం లేదని, కొవిడ్‌ సమయంలో ప్రాణాలను కూడా లెక్కచేయక విధులు నిర్వర్తించిన తీరు మరువలేనిదని కలెక్టర్‌ దిల్లీరావు అన్నారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన పారిశుధ్య కార్మికులకు సన్మానం, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కలెక్టరేట్‌ : పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేమని వారు లేనిదే ప్రజారోగ్యం లేదని, కొవిడ్‌ సమయంలో ప్రాణాలను కూడా లెక్కచేయక విధులు నిర్వర్తించిన తీరు మరువలేనిదని కలెక్టర్‌ దిల్లీరావు అన్నారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన పారిశుధ్య కార్మికులకు సన్మానం, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్లీరావు మాట్లాడుతూ, స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దేశ, రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పారిశుధ్య కార్మికుల సేవలు లేకపోతే ప్రజల ఆరోగ్యం కుంటుపడుతుందన్నారు. పారిశుధ్య కార్మికుల స్వచ్ఛత కార్యక్రమాలతో అందరి ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుందన్నారు. కొవిడ్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులను నిర్వర్తించి పారిశుధ్య కార్మికులు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలోను కాఫీ విత్‌ క్లాప్‌ మిత్ర కార్యక్రమం నిర్వహించి, పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశుధ్య కార్మికులతో కలిసి కొద్ద సేపు ముచ్చటించి కాఫీ సేవించారు. 40మంది క్లాప్‌ మిత్రలను సత్కరించి నిత్యావసర కిట్లను అందజేసారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ డీఆర్‌వో జి.వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ డి.వెంకటరమణ, ఈఈ రామలింగప్రసాద్‌, డీపీవో జయచంద్ర గాంధీ, డీఎల్‌పీవో బి. శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T01:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising