ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-01-26T00:44:24+05:30

విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలుగునాడు కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం నేతలు బుధవారం ఎన్టీటీపీఎస్‌ సీఈ అశోక్‌కుమార్‌ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ఎన్టీటీపీఎస్‌ సీఈకి వినతిపత్రం అందజేత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీటీపీఎస్‌(ఇబ్రహీంపట్నం), జనవరి 25: విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలుగునాడు కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం నేతలు బుధవారం ఎన్టీటీపీఎస్‌ సీఈ అశోక్‌కుమార్‌ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రతిపక్ష నేతగా ఇప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో కాంట్రాక్టు కార్మికులందరిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటామని ఇచ్చిన హామీని నేరవేర్చాలని కోరారు. పెండింగ్‌ ఇంక్రిమెంట్‌ బకాయిలు చెల్లించాలని, పది సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న కార్మికులకు ఇన్సెంట్‌ ఇప్పించాలన్నారు. గేట్‌లు వద్ద ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌లు పనిచేసే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని యేడల ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు గేట్‌ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనియన్‌ నేతలు అధ్యక్ష, కార్యదర్శిలు స్వతంత్ర కుమార్‌, మందడపు దుర్గారావు, రత్న శేఖర్‌, జొన్నలగడ్డ రాజేష్‌, వేములపూడి అప్పారావు, ముళ్లపూడి కృష్ణ, మల్నీడు వాసుదేవరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising