డంపింగ్ యార్డును తరలించాలి
ABN, First Publish Date - 2023-07-19T00:48:00+05:30
జగ్గయ్యపేట పురపాలకసంఘ పరిధిలో చిల్లకల్లు రోడ్డులోని సుమారు 11.3 ఎకరాల రెవెన్యూ భూమిలోకి డంపింగ్ యార్డును తరలించాలని జిల్లా సీపీఐ డిప్యూటీ సెక్రటరీ దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు.
జగ్గయ్యపేట, జూలై 18: జగ్గయ్యపేట పురపాలకసంఘ పరిధిలో చిల్లకల్లు రోడ్డులోని సుమారు 11.3 ఎకరాల రెవెన్యూ భూమిలోకి డంపింగ్ యార్డును తరలించాలని జిల్లా సీపీఐ డిప్యూటీ సెక్రటరీ దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట ఏరియా సీపీఐ సమితి నేతలతో మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. పట్టణానికి దూరంగా ఎవరికి ఇబ్బందిలేకుండా ఉందని, డంపింగ్‌యార్డు, కంపోస్ట్ యార్డులు ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉందన్నారు. రెవెన్యూ భూమి కావటంతో ప్రభుత్వం నుంచి పురపాలకసంఘానికి ఇప్పించేందుకు ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను తన పరపతిని ఉపయోగించాలని కోరారు. ఇప్పటి వరకు సరైన స్థలం దొరకలేదని చెబుతున్న పాలకవర్గానికి తామే ఈ భూమిని చూపిస్తున్నామన్నారు. విలియంపేట దళితులు దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందులను ఇప్పటికైనా తొలగించేందుకు ముందడగు వేయాలని కోరారు. డంపింగ్‌యార్డు మార్చాలని తమ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణకు విశేషస్పందన వచ్చిందన్నారు. డంపింగ్‌యార్డును చిల్లకల్లు రోడ్డులోకి మార్చేంత వరకు పార్టీ రాజీపడేది లేదన్నారు. అవసరమైతే విలి యంపేట వాసులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
జగ్గయ్యపేట ప్యాసింజర్ రైలు రాకకు ప్రయత్నమేది?
జగ్గయ్యపేటకు ప్యాసింజర్ రైలు తెస్తామని అసెంబ్లీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు కనీసం చొరవ చూపటం లేదని సీపీఐ నేత శంకర్ ఆరోపించారు. విద్యానగర్‌లో జగ్గయ్యపేట రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. రైల్వే శాఖకు, కేంద్రానికి వందల కోట్ల ఆదాయం తెస్తున్న పేట రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీసులు నడ పకపోవటం శోచనీయమన్నారు. నేతలు శివాజీ, శ్రీనివాసరావు, ఎం. రమేష్‌బాబు, ఎం.శ్రీనివాసరావు, పీ.వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-07-19T00:48:00+05:30 IST