ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాను రక్తహీనత రహితంగా తీర్చిదిద్దాలి : డీఈవో రేణుక

ABN, First Publish Date - 2023-03-26T00:52:25+05:30

జిల్లాను రక్తహీనత రహితంగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రే ణుక అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కృష్ణలంక, మార్చి 25 : జిల్లాను రక్తహీనత రహితంగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రే ణుక అన్నారు. విద్య, వైద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న ఎనీమియా ముక్తా భా రత్‌పై శనివారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో సీవీ రేణుక మాట్లాడుతూ జిల్లాలోని విద్యాశాఖ, సోషల్‌ వెల్ఫేర్‌ పరిధిలోని పాఠశాలలో రక్తహీనతతో బాధపడే విద్యార్థులకు ప్రతి రోజు ఐరన్‌ మాత్రలు, సప్లిమెంటేషన్‌ ఆవశ్యకత, అమలును పర్యవేక్షించాలన్నారు. ఉన్నత పాఠశాలలలోని నోడల్‌ ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మరింత బాధ్యత ఉంటుందన్నారు. 10 నుం చి 19ఏళ్ల వయస్సున్న బాలికల్లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు. వారిలో హిమోగ్లోబిన్‌ శాతంలో మె రుగుదల ఉండాలన్నారు. దాతల సాయంతో డ్రై అం జీరా అందించడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చన్నారు. మునగ, గోంగూర, పాలకూర వంటి ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించాలన్నారు. అనీమియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని డీఈవో సీవీ రేణుక అన్నారు. గిరిజన సంక్షే మ అధికారి ఎం.రుక్మాందగయ్య, జిల్లా రాష్ర్టీయ బా ల స్వస్థ కార్యక్రమం అధికారి డాక్టర్‌ మాధవి, ప్రధానోపాధ్యాయురాలు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising