పోలింగ్ కేంద్రాల్లో వసతులపై కమిషనర్ ఆరా
ABN, First Publish Date - 2023-09-23T00:26:47+05:30
ఎక్కడైనా 1400 మంది ఓటర్లు దాటితే ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో వసతులపై కమిషనర్ ఆరా
మధురానగర్, సెప్టెంబరు 22: ఎక్కడైనా 1400 మంది ఓటర్లు దాటితే ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన పోలింగ్ కేంద్రాలతో పాటు ప్రస్తుత కేంద్రాల్లో సమస్యలను గుర్తించే పనిలో భాగంగా ఆయన శుక్రవారం ఎన్నికల బూత్ స్థాయి అధికారులతో పలు డివిజన్లలో పర్యటించారు. 29వ డివిజన్ మధురానగర్‌లో రమాదేవి స్కూల్, శ్రీ వెంకటేశ్వర ముదిరాజ్ కల్యాణ మండపం, వీఎంసీ కల్యాణ మండపం, శాతవాహన కళాశాల, 27వ డివిజన్‌లో సాంబమూర్తి రోడ్డు, గులాబీతోట 199, 200 సచివాలయల పరిధి ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు అనువుగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు. మౌలిక సదుపాయాలను వివరించారు. ఏ పోలింగ్ స్టేషన్‌లో ఓటర్లు అధికంగా ఉన్నారో గుర్తించి సమాచారాన్ని అందించాలని అసిస్టెంట్ ఎలకో్ట్రరల్ రిజిస్ట్రేషన్ అధికారులను అదేశించారు. ఈ పర్యటనలో ఎలకో్ట్రరల్ రిజిస్ర్టేషన్ సిబ్బంది, ఎన్నికల బూత్‌స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-09-23T00:26:47+05:30 IST