ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో వీజే సన్నీ, సప్తగిరి సందడి

ABN, First Publish Date - 2023-06-03T00:55:08+05:30

నగరంలో సినీ హీరో వీజే సన్నీ, కమెడియన్‌ సప్తగిరి సందడి చేశారు. బిగ్‌బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్‌స్టాపబుల్‌ ఈ నెల 9న విడుదల కానున్న సందర్భం గా బందర్‌ రోడ్డులోని పీవీపీ మాల్‌లో సినిమా ప్రమోషన్‌ను శుక్రవారం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లబ్బీపేట, జూన్‌ 2 : నగరంలో సినీ హీరో వీజే సన్నీ, కమెడియన్‌ సప్తగిరి సందడి చేశారు. బిగ్‌బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్‌స్టాపబుల్‌ ఈ నెల 9న విడుదల కానున్న సందర్భం గా బందర్‌ రోడ్డులోని పీవీపీ మాల్‌లో సినిమా ప్రమోషన్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీజే సన్నీ మాట్లాడుతూ డైరెక్టర్‌ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రం విడుదల కానుందని, నక్షత్ర, అక్సాఖాన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారన్నారు. పిల్లా నువ్వు లేని జీవితం, ఈడో ర కం ఆడో రకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకు న్న డైరెక్టర్‌ రత్నబాబు అన్‌స్టాపబుల్‌ సినిమాను ఏ2బీ ఇండియా ప్రొడక్షన్‌లో రజిత్‌రావు నిర్మిస్తున్నారన్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, గో వా ప్రాంతాల్లో షూటింగ్‌ జరిగిందని, పోస్టర్లు, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకన్నాయన్నారు. బిత్తిరి సత్తి, షకలక శంకర్‌, పృథ్వీ లాంటి నటులు కీలక పాత్రలు పోషించారన్నారు. అలాగే డీజే టిల్లు, మురళి, సూపర్‌ విమర్‌ లిరీషా, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, చమ్మక చంద్ర నటిస్తున్నారని, బీమ్స్‌ సిసిరోలియే సంగీతాన్ని సమకూర్చారన్నారు. కమెడియన్‌ సప్తగిరి మాట్లాడుతూ సినిమాలో కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, డైరెక్టర్‌ రత్నబాబు చిత్రాన్ని చాలా చక్కగా తీశారన్నారు.

Updated Date - 2023-06-03T00:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising