ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ శ్రేణుల్లో జోష్‌

ABN, First Publish Date - 2023-04-29T00:48:29+05:30

స్వర్గీయ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు వేలాదిగా ఎన్టీఆర్‌ అభి మానులు, తెలుగుదేశం అభిమానులు తరలిరావడం తో తెలుగుదేశం శ్రేణులు, నాయకులు ఉబ్బితబ్బిబ్బ య్యారు. శుక్రవారం పోరంకి అనుమోలు గార్డెన్స్‌ ప్రాంగణంలో జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్స వాలకు ప్రజలు పోటెత్తడంతో స్థానిక టీడీపీ నాయ కులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు వేలాదిగా తరలివచ్చిన ఎన్టీఆర్‌, టీడీపీ అభిమానులు

ఫ ఏర్పాట్లను పర్యవేక్షించిన స్థానిక నేతలు

ఫ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, అనుమోలు, వెలగపూడిలకు కృతజ్ఞతలు తెలిపిన ఉత్సవ కమిటీ చైర్మన్‌ టీడీ జనార్దన్‌

పెనమలూరు, ఏప్రిల్‌ 28 : స్వర్గీయ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు వేలాదిగా ఎన్టీఆర్‌ అభి మానులు, తెలుగుదేశం అభిమానులు తరలిరావడం తో తెలుగుదేశం శ్రేణులు, నాయకులు ఉబ్బితబ్బిబ్బ య్యారు. శుక్రవారం పోరంకి అనుమోలు గార్డెన్స్‌ ప్రాంగణంలో జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్స వాలకు ప్రజలు పోటెత్తడంతో స్థానిక టీడీపీ నాయ కులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. పాస్‌ల లో కార్యక్రమం ప్రారంభ సమయం మధ్యాహ్నం నాలుగున్నర అని ఉన్నా, మూడు గంటల నుంచే ప్రేక్షకుల తాకిడి ప్రారంభమయింది. ఒక దశలో ఎన్‌ పేరున్న గ్యాలరీకి ప్రవేశాలను ఆపివేయాల్సి వచ్చింది. నిముషాలలో గ్యాలరీలు నిండిపోయాయి. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ దగ్గరుండి పార్టీ శ్రేణులతో పార్కింగ్‌ వద్ద, ఎంట్రన్స్‌ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. వంద అడుగుల రోడ్డు మొత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్టీఆర్‌, టీడీపీ అభిమానులతో కిటకిటలాడింది. సభాప్రాంగణంలో ఎటు చూసినా ఎక్కువ సంఖ్యలో మహిళలు, వృద్ధులు కనిపించారు. కార్యక్రమంలో ఆలిండియా సూపర్‌స్టార్‌ తలైవా రజినీకాంత్‌, బాలకృష్ణ ప్రసంగాల సమ యంలో ప్రేక్షకులు ఉత్సాహాన్ని కనబరచారు. ఎన్టీఆర్‌ తనయ లోకేశ్వరి మాట్లాడినప్పుడు ప్రేక్షకులు ఆసక్తిగా గమనించారు. కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర, సినీ ప్రస్థానం, రాజకీయ రంగప్రవేశం, ఆయన విజయాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రేక్షకులు ఓపిగ్గా వీక్షించారు. ఇదే అంశాలపై ప్రదర్శించిన బుర్రకథ ప్రేక్షకులను ప్రత్యే కంగా ఆకర్షించింది. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సక్సెస్‌కు చక్కటి సహకారం అందించిన బోడె ప్రసాద్‌, అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు, శ్రేయాస్‌ మీడియాకు ఉత్సవ కమిటీ చైర్మన్‌ టీడీ జనార్ధన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన టీడీపీ నాయకుల్లో మారుపూడి ధనకోటేశ్వరరావు, బోడె మనోజ్‌, కోయ ఆనంద్‌ ప్రసాద్‌, దొంతగాని పుల్లేశ్వరరావు, షేక్‌ బుజ్జి, తుమ్మల రాంకుమార్‌, అంగిరేకుల మురళి, సంగెపు రంగారావు, అనంతనేని ఆజాద్‌, శొంఠి శివరాం ప్రసాద్‌, మొక్కపాటి శ్రీనివాస్‌, ఆచంట వెంకటచంద్ర, కొమ్మినేని వెంకటేష్‌, ముసునూరి నిర్మల్‌, ముసునూరి శ్రీనివాస్‌, ముసునూరి శ్రీథర్‌, గుజ్జర్లపూడి బాబూరావు, మండవ భార్గవ్‌, కొండా ప్రవీణ్‌, కొల్లిపర ప్రమోద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-04-29T00:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising