చెట్ల నరికివేతపై టీడీపీ ఆందోళన
ABN, First Publish Date - 2023-02-21T00:56:45+05:30
అవినీతి బ్రదర్స్ చేస్తున్న ఆకృత్యాలకు అధికారులు బలికాక తప్పదని మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆరోపించారు.
చెట్ల నరికివేతపై టీడీపీ ఆందోళన
నందిగామ, ఫిబ్రవరి 20: అవినీతి బ్రదర్స్ చేస్తున్న ఆకృత్యాలకు అధికారులు బలికాక తప్పదని మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆరోపించారు. పట్టణంలోని చెట్లు నరివేతపై టీడీపీ ఆధ్వర్యంలో ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఆమె మండిపడ్డారు. కొండలు, గుట్టల దోపిడీ పూర్తయిందని, నేడు చెట్లపై పడ్డారని ఆరోపించారు. రోడ్ల విస్తరణ పేరుతో నరికిన చెట్ల అమ్మకాలలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు. వారు చేస్తున్న అవినీతికి సహకరిస్తున్న అధికారులు మూల్యం చెల్లించక తప్పదన్నారు. మునిసిపల్ కమిషనర్ రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోపిడీ చేస్తున్నాడని ఆరోపించారు. అనంతరం ఆర్‌డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
Updated Date - 2023-02-21T00:56:49+05:30 IST