వైసీపీ పాలనకు చరమగీతం
ABN, First Publish Date - 2023-02-21T00:38:54+05:30
: ధరల పెంపు, పన్నుల భారాలతో ప్రజలను కష్టాల పాల్జేస్తున్న జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.
బంటుమిల్లి : ధరల పెంపు, పన్నుల భారాలతో ప్రజలను కష్టాల పాల్జేస్తున్న జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. అర్తమూరు గ్రామంలో సోమవారం ఇదేమి ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. నియోజకవర్గ పరిశీలకులు సాదరబోయిన ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు వీరబాబు, ప్రధాన కార్యదర్శి కాశీ, లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శి అంగర రంగనాథ్ పార్లమెంట్ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు యిల్లూరి లీలా కృష్ణ, జడ్పీటీసీ సభ్యుడు అర్జా నగేష్, చలపాటి వీరప్రసాద్, కాగిత బాలాజీ, టీఎన్‌ఎ్‌సఎఫ్ అధ్యక్షుడు కాగిత రవి తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లి : రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్(రాజా) దుయ్యబట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చల్లపల్లి నారాయణరావు నగర్‌లో సోమవారం జరిగింది. గురుకుల పాఠశాల సమీపంలో ఇంటింటికీ వెళ్లిన రాజా ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి శూన్యమన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టలేకపోయారన్నారు. చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. క్లస్టర్ ఇన్‌చార్జి మోర్ల శివ, ఎంపీటీసీ సభ్యుడు పైడిపాముల స్వప్న, మోర్ల ప్రసాద్, నిడమానూరి దిలీ్‌పకుమార్, రావి చిట్టి, షేక్ నబీఘోరి, తాతా ప్రదీప్, షేక్ సిలార్, హమీద్, జాబీర్, రవి తదితరులు పాల్గొన్నారు. నాగాయలంక : వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య, మధ్య తరగతి వర్గాలకు గుదిబండగా మారాయని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే రాష్ట్రం, ప్రజలు బాగుపడతారని ఆమె పేర్కొన్నారు. సోమవారం నాగాయలంక ఆరో వార్డులో టీడీపీ నేతలతో స్వర్ణలత ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించారు. లకనం నాగాంజనేయులు, తుమ్మల నరేంద్ర, ఉప్పల ప్రసాద్, నాగిడి తాతారావు, కర్రి కృష్ణమూర్తి, కొల్లు సత్యనారాయణ, నాగిడి పోతురాజు, తోపుల బాబురావు తదితరులు పాల్గొన్నారు. కోడూరు : రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని మాజీ జడ్పీటీసీ బండే శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సాలెంపాలెం, కోడూరు ఎనిమిదో వార్డుల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత ్వ పనితీరును ప్రజలకు వివరించారు. టీడీపీ నేతలు కొప్పనాతి సత్యనారాయణ, జరుగు వెంకటేశ్వరరావు, కాగిత రామారావు, కొక్కిలిగడ్డ జాన్ విల్సన్, అద్దంకి పాండురంగారావు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T00:38:55+05:30 IST