ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2023-06-03T01:17:34+05:30

బాల్య వివాహలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు సూచించారు.

బాల్య వివాహాల నిర్మూలనపై జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దిల్లీరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు హెచ్చరిక

కలెక్టరేట్‌, జూన్‌ 2: బాల్య వివాహలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు సూచించారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాల్య వివాహం జరిగినట్లు గుర్తించిన వెంటనే తల్లిదండ్రులు, పురోహితులు, పాస్టర్లు, ఖాజీలపైనా కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలబాలికలపై లైంగిక వేధింపులు, చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అధికారులు, చైల్డ్‌లైన్‌ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ నిర్వహించారు. బాల్య వివాహాలపై పోలీసులు కేసులు నమోదు చేయకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సీడీపీవోలు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఎంఎస్‌కే పోలీసులు బాల్య వివాహాలను అడ్డుకోవడంలో ముందుండి, బాల్య వివాహాల నిరోధక చట్టం-2006 మార్గదర్శకాలను అమలు చేయాలన్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, చిన్నారుల అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. బాల్య వివాహాలు జరిగినట్లు గుర్తిస్తే వధూవరుల జనన ధ్రువీకరణ పరిశీలన కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి నిర్ధారించుకోవాలన్నారు. వివాహం చేసు కునే వారు ముందుగా సమీపంలోని సచివాలయాల్లో నమోదు చేసుకునేలా వలంటీర్ల ద్వారా గ్రామంలో తెలియజేయాలని సూచించారు.

Updated Date - 2023-06-03T01:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising