అరుణాచలానికి ప్రత్యేక బస్సు
ABN, First Publish Date - 2023-03-02T01:03:02+05:30
తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ మహో త్సవంలో పాల్గొనే భక్తుల కోసం విజయవాడ డిపో నుంచి ప్రత్యేక బస్సు నడు పుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వన్‌టౌన్, మార్చి 1: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ మహో త్సవంలో పాల్గొనే భక్తుల కోసం విజయవాడ డిపో నుంచి ప్రత్యేక బస్సు నడు పుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘5వ తేదీ రాత్రి 9గంటలకు పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 6న ఉదయం శ్రీకాళహస్తిలో భక్తులు స్వామిని దర్శించుకుని, తరువాత గోల్డెన్ టెంపుల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి బయలుదేరి 7వతేదీ పౌర్ణమిరోజు ఉదయం అరుణాచలానికి చేరుకుం టారు. గిరి ప్రదక్షిణ అనంతరం అదేరోజు సాయంత్రం బయలుదేరి 8న ఉద యం 5 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. ఈ యాత్రకు రానుపోను టికెట్ ధర రూ.2,500, 95268 సర్వీసు నెంబరుగల బస్సుకు ఆన్‌లైన్ రిజ ర్వేషన్ సౌకర్యం ఉంది. వివరాలకు 80742 98487, 73828 98942 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.’’ అని డీఎం శ్రీనివాసశర్మ తెలిపారు.
Updated Date - 2023-03-02T01:03:02+05:30 IST