ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదుకోవడంలో మీనమేషాలు

ABN, First Publish Date - 2023-05-10T01:53:50+05:30

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పంట నష్టం అంచనా ప్రక్రియ జిల్లాలో ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాస్థాయి అధికారులు, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కానీ పంటనష్టం అంచనాలు తయారు చేయాలని ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు ఇంకా రాలేదని చెబుతున్నారు. పసుపుతీత, మొక్కజొన్నకోత పూర్తయితే పంటనష్టం పరిధిలోకి రావని అధికారులు చెబుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటనష్టాన్ని అధికారులు కళ్లారా చూసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పడమే తప్ప పంటనష్ట్టపరిహారం అందిస్తామని రైతులకు భరోసా ఇవ్వడం లేదు. పంటనష్టం అంచనా తయారీలో నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కాలయాపన చేస్తే రైతులు ఉద్యమించడం ఖాయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పంట నష్టం అంచనా ప్రక్రియ జిల్లాలో ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాస్థాయి అధికారులు, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కానీ పంటనష్టం అంచనాలు తయారు చేయాలని ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు ఇంకా రాలేదని చెబుతున్నారు. పసుపుతీత, మొక్కజొన్నకోత పూర్తయితే పంటనష్టం పరిధిలోకి రావని అధికారులు చెబుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటనష్టాన్ని అధికారులు కళ్లారా చూసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పడమే తప్ప పంటనష్ట్టపరిహారం అందిస్తామని రైతులకు భరోసా ఇవ్వడం లేదు. పంటనష్టం అంచనా తయారీలో నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కాలయాపన చేస్తే రైతులు ఉద్యమించడం ఖాయం.

జిల్లాలో 4,263 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. పసుపుతీత దాదాపు పూర్తయ్యేదశలో ఉంది. పసుపుతీసిన తరువాత ఉడకబెట్టడం, ఎండబెట్టడం, పాలిష్‌ పట్టడం వంటి పనులు చేయాల్సి ఉంది. పసుపు ఉడకబెట్టిన తరువాత పూర్తిస్థాయిలో ఎండలుకాస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పసుపు ఉడకబెట్టే దశ, ఆరబెట్టే సమయంలో వారంరోజుల పాటు వర్షాలు కురిశాయి. దీంతో పసుపు తడిచి ఎరుపురంగులోకి మారింది. పురుగుపట్టింది. పసుపు తీసిన తరువాత పంటన ష్టం అంనా వేయడానికి నిబంధలు అనుమతించవని అధికారులు చెబుతున్నారు. దీంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పసుపుసాగు చేసిన రైతుల్లో అయోమయం నెలకొంది. దెబ్బతిన్న పసుపును అధికారులు చూసినా పంటనష్టపరిహరం అందించడానికి నిబంధనలు వర్తించవని చెబుతుండటంతో రైతుల్లో అలజడి ప్రారంభమైంది. దెబ్బతిన్న పసుపును కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు కూడా ఇంకా జిల్లాలో ఏర్పాటు చేయలేదు. దీంతో దెబ్బతిన్న పంటను ఎలా విక్రయించాలనే అంశంపై రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు. దెబ్బతిన్న పసుపుపంటకు ఎకరానికి నష్టపరిహారం ఎంత మేర ఇస్తారనే అంశంపైనా అధికారుల వద్ద సమాచారం లేకపోవడం గమనించదగ్గ అంశం. పసుపు మద్దతు ధర క్వింటాకు రూ.6850 చెల్లించాలి. ఈ ఏడాది పసుపు కొనుగోళ్లు ప్రారంభమైన సమయంలో క్వింటాకు రూ.4,600 వ్యాపారులు చెల్లించారు. ప్రస్తుతం పసుపు దెబ్బతినడంతో వ్యాపారులు ధరను అమాంతం తగ్గించి వేశారు. దెబ్బతిన్న పంటను నాణ్యత మేరకు కొనుగోలు చేసేందుకు మద్దతు ధరను ప్రభుత్వ ప్రకటించకపోవడం గమనించదగ్గ అంశం. ప్రభుత్వ సూచనల మేరకే కొనుగోలు కేంద్రాల ద్వారా పసుపు కొనుగోలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పదేళ్లుగా మారని పరిహారం మొత్తం

రైతులు సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతింటే మళ్లీ వెం టనే పంటలు సాగు చేసుకునేందుకు పంటనష్టపరిహారం ఇచ్చే ఆనవాయితీ ఉంది. మొక్కజొన్నకు హెక్టారుకు రూ.12,500, జొన్నకు రూ.6,800, వరికి రూ.15,000 ఇవ్వాల్సి ఉంది. ఈ పరిహారం సుమారుగా పది సంవత్సరాల క్రితం ప్రకటించినవి. గత పదేళ్లుగా వ్యవసాయంలో నూతన పద్దతులు వచ్చా యి, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు, యంత్రాల ఖర్చులు పెరిగా యి. అయినా పదేళ్లనాటి లెక్కల ప్రకారమే పంటన ష్టపరిహారం ఇస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం పంట కోయకుంటేనే పరిహారం అందిస్తామని చెబుతుండటంతో రైతులు కలవరానికి గురవుతున్నారు. 15వేల ఎకరాలకు పైగా జిల్లాలో ఈ రబీ సీజన్‌లో మొక్కజొన్న సాగు జరిగింది. కోతపూర్తయిన తరువాత తోటల్లో ఉన్న మొక్కజొన్న కండెలు వర్షంలో తడిచి ఫంగస్‌ బారిన పడ్డాయి. కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న తడిచి గింజలు మొలకెత్తాయి, ఇంతనష్టం జరిగినా పంటనష్టపరిహారం అందించేందుకు నిబంధనల పేరుతో దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసేందుకు అడ్డంకులు సృష్టిస్తుండటం గమనించదగ్గ అంశం. వరి కోత దశలో ఉన్న సమయంలో వారం రోజులపాటు వర్షాలు కురవడంతోఽ కోతకోయని వరి, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచింది. దీంతో 45 నుంచి 50 శాతం వరకు బియ్యం నూకలుగా మారుతున్నాయి. ధాన్యంలో నాణ్యత సరిగాలేదనే కారణంతో బస్తా ధాన్యం రూ.900లుగా మిల్లర్లు ధర నిర్ణయించారు. దీంతో రైతులు బస్తాకు రూ. 600 నష్టపోతున్నారు. ఎకరానికి 40 బస్తాల దిగుబడివస్తే రూ. 24 వేలను మద్దతుధర రూపంలో కోల్పోతే, రైతులకు సాగు ఖర్చులు కూడా రానిస్థితి. ఈ స్థితిలో కూడా నిబంధలను సాకుగా చూపి రైతులకు పంటనష్టపరిహారం ఇవ్వకుండా సాచివేత ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

Updated Date - 2023-05-10T01:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising