ఆర్టీసీ కానిస్టేబుల్ నిజాయితీ
ABN, First Publish Date - 2023-09-22T00:48:21+05:30
బస్సులో పోగొట్టుకున్న పర్సును ప్రయాణికురాలికి అందించి ఆర్టీసీ కానిస్టేబుల్ తన నిజాయి తీని చాటుకున్నాడు.
పోగొట్టుకున్న పర్సు ప్రయాణికురాలికి అందజేత
గన్నవరం, సెప్టెంబరు 21: బస్సులో పోగొట్టుకున్న పర్సును ప్రయాణికురాలికి అందించి ఆర్టీసీ కానిస్టేబుల్ తన నిజాయి తీని చాటుకున్నాడు. గన్నవరం డిపో నుం చి హనుమాన్‌జంక్షన్ వెళ్లి 252 సర్వీస్ బస్సు బుధవారం రాత్రి తిరిగి గ్యారేజీలోకి వెళుతుండగా సెక్యూరిటీ గేటు వద్ద బస్సు ఆపి ఆర్టీసీ కానిస్టేబుల్ ఎస్కేఎఫ్ రెహ మాన్ తనిఖీ చేశాడు. బస్సులో పర్సు కని పించింది. వెంటనే అధికారులకు ఆయన సమాచారమిచ్చాడు. అప్పటికే పర్సు పోగొ ట్టుకున్న బి.స్వప్నకుమారి ఆర్టీసీ సెక్యూరిటీ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె టికె ట్‌ను పరిశీలించి, లిఖితపూర్వకంగా ఆమె తో రాయించుకుని ఆ పర్సును రెహమాన్ చేతుల మీదుగా అందజేయించారు. తన పర్సులో రూ.7వేలు ఉన్నాయని తెలిపింది. తన పర్సు తనకు అందించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. నిజాయితీగా వ్యవ హరించిన ఆర్టీసీ కానిస్టేబుల్ రెహమాన్ ను డిపో మేనేజర్ పి.శివాజీ, సిబ్బంది అభి నందించారు.
Updated Date - 2023-09-22T00:48:21+05:30 IST