ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఆర్జీయూకేటీ నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2023-06-03T01:23:02+05:30

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..జూలై 13న సెలక్షన్‌ లిస్ట్‌.. 21 నుంచి 25 వరకు కౌన్సెలింగ్‌..ఆగస్టు పదో తేదీలోపు తరగతులు ప్రారంభం

నూజివీడు టౌన్‌, జూన్‌ 2: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి నూజివీడు ట్రిఫుల్‌ ఐటీ క్యాంప్‌సలో ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ కేసీ రెడ్డి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘నూజివీడు, ఆర్కేవ్యాలీ (ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలలో 4,400 సీట్లకు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రక్రియ 4వ తేదీ నుంచి ప్రారంభమై 26వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తులను ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరి వారికి జూలై 5 నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక అవసరాలు కలిగిన వారి రిజర్వేషన్‌ను మూడు నుంచి ఐదు శాతానికి పెంచాం. 40 శాతం అంగ వైకల్యం ఉన్నవారు మాత్రమే ఈ కేటగిరిలో అర్హులు. జనరల్‌ కేటగిరి ఎంపిక జాబితాను జూలై 13న ఆన్‌లైన్‌లో ఉంచుతాం. జూలై 21, 22 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ, 24, 25 తేదీల్లో ఒంగోలు, శ్రీకాకుళం క్యాంప్‌సలకు కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ఒంగోలు క్యాంపస్‌ విద్యార్థులు ఇడుపులపాయ క్యాంప్‌సకు, శ్రీకాకుళం విద్యార్థులు ఎచ్చెర్లకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆగస్టు పదో తేదీలోపు మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. రెగ్యులర్‌ అప్‌డేట్‌ల కోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలి’ అని కేసీ రెడ్డి వివరించారు.

Updated Date - 2023-06-03T01:23:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising