చంద్రబాబు పాలనలోనే మహిళలకు మేలు : రవీంద్ర
ABN, First Publish Date - 2023-08-02T01:34:07+05:30
మహిళల ఆత్మగౌరవాన్ని పరిరక్షించేది చంద్రబాబునాయుడేనని, మహాశక్తి పథకంతో మహిళలకు మళ్లీ ఆర్ధిక పరిపుష్టి చేకూరుస్తారని మాజీ మంత్రి, టీడీపీపొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 1 : మహిళల ఆత్మగౌరవాన్ని పరిరక్షించేది చంద్రబాబునాయుడేనని, మహాశక్తి పథకంతో మహిళలకు మళ్లీ ఆర్ధిక పరిపుష్టి చేకూరుస్తారని మాజీ మంత్రి, టీడీపీపొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. బొర్రపోతుపాలెం గ్రామంలో మంగళవారం ఇంటింటికీ పర్యటించారు. తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, తలారి కుంచే నాని, లంకే నారాయణ ప్రసాద్, సర్పంచ్ గట్టే నాగ సుశీలమణి, దేవరపల్లి అనిత, లక్ష్మి పాల్గొన్నారు. మూడో డివిజన్‌లో మహాశక్తి చైతన్య యాత్ర నిర్వహించారు. టీడీపీ కార్పొరేటర్లు మరకాని సమతా కీర్తి, దేవరపల్లి అనిత, టీడీపీ నగర కార్యదర్శి పిప్పళ్ళ కాంతారావు, వసంతకుమారి, చిన్నం సురేష్ తదితరులు పర్యటించారు. చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీలను సమతా కీర్తి వివరించారు. ఘంటసాల : టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మినీ మానిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యత నిచ్చారని తెలుగు మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి తెలిపారు. మాజీ జడ్పీటీసీ సభ్యురాలు తుమ్మల వరలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ఘంటసాలపాలెంలో మహాశక్తి చైతన్య యాత్ర జరిగింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గె లిపించాలని కోరారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. నియోజకవర్గ అధ్యక్షురాలు బండే నాగ వెంకట కనకదుర్గ, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, దుర్గగుడి పాలకమండలి మాజీ సభ్యురాలు విశ్వనాథపల్లి పాప, మేకా దుర్గ, పైడిపాముల స్వప్న, ఘంటసాలపాలెం గ్రామ మహిళలు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T01:34:07+05:30 IST