వైభవంగా సాగుతున్న రంగమ్మ తిరునాళ్ల
ABN, First Publish Date - 2023-04-09T00:31:36+05:30
తేలప్రోలులో కొలువైయున్న రంగమ్మ పేరంటాలు అమ్మ వారి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గతనెల 23వతేదీనుండి 5వతేదీవరకు గ్రామంలో ఊరేగిన అమ్మవారు ఈనెల 6న ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ వారుసులు జక్కా చంద్రశేఖర్ వారి సోదరులు ఉదయ్, రమేష్‌లు అంకగుడారి వేసి ఉత్సవాలను ప్రారంభించారు.
ఉంగుటూరు, ఏప్రిల్ 8 : తేలప్రోలులో కొలువైయున్న రంగమ్మ పేరంటాలు అమ్మ వారి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గతనెల 23వతేదీనుండి 5వతేదీవరకు గ్రామంలో ఊరేగిన అమ్మవారు ఈనెల 6న ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ వారుసులు జక్కా చంద్రశేఖర్ వారి సోదరులు ఉదయ్, రమేష్‌లు అంకగుడారి వేసి ఉత్సవాలను ప్రారంభించారు. స్ధానికులతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రభలతో తరలివచ్చిన రైతులు, భక్తులు ఆమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు సమర్పించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురు,శుక్ర,శనివారాల్లో రాత్రివేళల్లో అమ్మవారిని ఆలయ ప్రాంగణంలోని బహిరంగ ప్రదేశంలో ఊయాల ఉత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఊయలోత్సవంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలనుంచి పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా, పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆదివారం అమ్మవారికి బోనాలు(నైవేద్యాల)సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ వారసుడు జక్కా చంద్రశేఖర్ తెలిపారు. శనివారం వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు రంగమ్మ తిరునాళ్ల మహోత్సవమునకు హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. స్ధానిక నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-09T00:31:36+05:30 IST