ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్టీఆర్‌ జిల్లాను ముంచెత్తిన వర్షం

ABN, First Publish Date - 2023-09-04T01:01:33+05:30

ఎన్టీఆర్‌ జిల్లాను ఆదివారం తెల్లవారుజామున వర్షం ముంచెత్తింది. రెండు గంటలపాటు వర్షం కురిసింది. దీంతో విజయవాడ జలమ యమైంది.

మెట్ట పంటలకు మేలు

విజయవాడ, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ జిల్లాను ఆదివారం తెల్లవారుజామున వర్షం ముంచెత్తింది. రెండు గంటలపాటు వర్షం కురిసింది. దీంతో విజయవాడ జలమ యమైంది. జిల్లాలో ఇప్పటికే తక్కువ వర్షపాతం నమోదైంది. మెట్టప్రాంత రైతులు వర్షాభావ పరిస్థితుల వల్ల ఆవేదనకు లోన వుతున్నారు. ఈ వర్షం మెట్టప్రాంత పంటలకు మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు. మెట్టలో ఎక్కువగా మిర్చి, ప్రత్తి పంటలు వేశారు. ఈ పంటలకు నీటి సదుపాయం లేకపోవడంతో జీవాన్ని కోల్పోతున్నాయి. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే పంట లకు మరింత నష్టం జరిగేదని రైతులు చెబుతున్నారు. మరోపక్క కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు ఎండకాలంలో మాదిరిగా నమోదవు తున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. జగ్గయ్యపేట రూరల్‌, నందిగామ, వత్సవాయి, కంచి కచర్ల, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఎ.కొండూరు, గంపలగూడెం, మైలవరం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రుతుపవనాలు మొదలయ్యాక ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారని రైతులు చెబుతున్నారు.

Updated Date - 2023-09-04T01:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising