రిటైల్ అవుట్‌లెట్లతో నాణ్యమైన మత్స్య సంపద
ABN, First Publish Date - 2023-03-02T00:49:35+05:30
మత్స్య సంపదకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పఽథకం అమలు కమిటీ సమావేశం బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కమిటీ చైర్మన్, కలెక్టర్ దిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు.
కలెక్టరేట్, మార్చి 1 : మత్స్య సంపదకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పఽథకం అమలు కమిటీ సమావేశం బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కమిటీ చైర్మన్, కలెక్టర్ దిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకార కుటుంబాల ఆర్ధిక బలోపేతం లక్ష్యంతో మత్స్య సంపదకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వినియోగదారులకు నాణ్యమైన పరిశుభ్రతతో కూడిన మత్స్య సంపద అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. దీనిలో భాగంగా ఫిష్ రిటైల్ అవుట్‌లెట్లు, రిటైల్ మార్కెటింగ్ హబ్‌లు, కియోష్క్ ఐస్‌బాక్సులతో కూడిన టూవీలర్, త్రీవీలర్, మోటర్ సైకిళ్ల పంపిణీ, లైవ్‌ఫిష్ అమ్మక కేంద్రాల వంటి యూనిట్లను నెలకొల్పేందుకు సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు. మత్స్యకారుల జీవనోపాధికి దాదాపు 15 లక్షల చేప పిల్లలను కృష్ణానదిలో విడుదల చేయడం జరిగిందని, మరో 10 లక్షల పిల్లలను కొనుగోలు చేసి విడుదల చేయాల్సి ఉందన్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ఇన్స్‌లేటడ్ వాహనాలను మంజూరు చేస్తున్నామన్నారు. లైవ్ ఫిష్ వెండింగ్ కేంద్రాల ఏర్పాటుకు, దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు అనుమతి మంజూరు చేస్తున్నామన్నారు. మత్స్య అవుట్‌లెట్ల కేంద్రాల ఏర్పాటుకు నగరంలో ఇరిగేషన్, ఆర్టీసీ, నగరపాలకసంస్థ, మార్కెటింగ్, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ వంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించి గుర్తించిన ఖాళీ స్థలాలలో అనుమతుల కొరకు ఆయా శాఖల అధికారులతో చర్చించి అవుట్‌లెట్ల ఏర్పాటకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో మత్స్యశాఖ అధికారి ఎ.నాగరాజు, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసనాయక్, జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం.విజయభారతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T00:49:35+05:30 IST