ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైల్వే కార్మికులకు పనులు కల్పించండి

ABN, First Publish Date - 2023-08-02T00:16:17+05:30

రైల్వేస్టేషన్‌లో పద్మావతి రక్షక్‌ కాంట్రాక్ట్‌ సంస్థలు అక్రమంగా తొలగించిన పాత కార్మికులకు పనులు కల్పించి న్యాయం చేయాలని రైల్వే ఉన్నతాధికారులను 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోయ సత్యబాబు కోరారు

రైల్వే కాంట్రాక్ట్‌ కార్మికుల నిరసన

రైల్వే కార్మికులకు పనులు కల్పించండి

50వ డివిజన్‌ కార్పొరేటర్‌ సత్యబాబు

డీఆర్‌ఎం కార్యాలయం వద్ద నిరసన

రైల్వేస్టేషన్‌, ఆగస్టు 1: రైల్వేస్టేషన్‌లో పద్మావతి రక్షక్‌ కాంట్రాక్ట్‌ సంస్థలు అక్రమంగా తొలగించిన పాత కార్మికులకు పనులు కల్పించి న్యాయం చేయాలని రైల్వే ఉన్నతాధికారులను 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోయ సత్యబాబు కోరారు. రైల్వే కార్మికులు డీఆర్‌ఎం కార్యాలయం వద్ద మంగళవారం రైల్వేస్టేషన్‌లో పద్మావతి రక్షక్‌ కాంట్రాక్ట్‌ సంస్థలు అక్రమంగా తొలగించినందుకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను అక్రమంగా, చట్ట విరుద్ధంగా పని నుంచి కాంట్రాక్టర్లు ఆపేస్తే ప్రిన్సిపాల్‌ ఎంప్లాయర్‌గా రైల్వే ఉన్నతాధికారులు తగిన చర్యలను చేపట్టి కార్మికులకు న్యాయం చేసే అవకాశం ఉందన్నారు. ఎప్పటి నుంచో స్టేషన్‌ పనులను నమ్ముకుని పని చేస్తున్న కార్మికులకు మళ్లీ పని కల్పించడం న్యాయమని తెలిపారు. రైల్వే అధికారులు వెంటనే కార్మికులకు పని కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ ఎ.కమల, యూనియన్‌ కార్యదర్శి ఈవీ నారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising