ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉక్కు పిడికిలి..

ABN, First Publish Date - 2023-09-23T00:38:37+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ శ్రేణుల ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి.

గొల్లపూడిలో ‘బాబుతో నేను’ పోస్టర్‌లో సంతకం చేస్తున్న కాలేజీ యువకుడు

రెండు జిల్లాల్లో మిన్నంటుతున్న నిరసనలు

గొల్లపూడిలో పెద్ద ఎత్తున పాల్గొన్న ముస్లింలు

తిరువూరు రిలే దీక్షల్లో మహిళలు

అవనిగడ్డ, నిమ్మకూరులో వర్షంలోనూ దీక్ష

మచిలీపట్నంలో సర్వమత ప్రార్థనలు

ముగిసిన 36 గంటల భగవద్గీత పారాయణ

కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల రిలే దీక్షలు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ శ్రేణుల ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నల్లబెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధతో పాటు టీడీపీ కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్‌, చెన్నుపాటి ఉషారాణి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాంబేకాలనీలోని టీడీపీ కార్యాలయం వద్ద పలువురు నాయకులు సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎంపీ కేశినేని నాని ఆదేశాల మేరకు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఎంఎస్‌ బేగ్‌ నేతృత్వంలో ‘బాబుతో నేను’ పేరిట రిలే దీక్షలు చేపట్టారు. మైలవరం నియోజకవర్గం కీర్తిరాయినిగూడెంలో ఏర్పాటుచేసిన గణేశ్‌ మండపంలోని వినాయకుడికి టీడీపీ నాయకుడు గన్నె ప్రసాద్‌ ప్రత్యేక పూజలు చేశారు. జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామంలో ప్రజలు శుక్రవారం పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ‘బాబుకు అండగా.. భువనమ్మకు తోడుగా..’ అంటూ మహిళలు, పురుషులు ర్యాలీలో పాల్గొన్నారు. మైలవరంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షల శిబిరంలో వెదురుబీడెం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయం ఎదుట చంద్రబాబుకు మద్దతుగా ప్రారంభించిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో ముస్లిం నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘బాబుకు తోడుగా.. నియంతపై పోరాటం కోసం మేముసైతం’ అంటూ ఏర్పాటుచేసిన సిగ్నేచర్‌ బోర్డుపై పెద్ద సంఖ్యలో ప్రజలు సంతకాలు చేశారు. తిరువూరులో తెలుగు మహిళల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేశారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ నల్లగట్ల సుధారాణి, నాదెళ్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శావల దేవదత్‌, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఈ దీక్షా శిబిరాన్ని ప్రారంభించగా, తెలుగు రైతు ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. నందిగామ టీడీపీ కార్యాలయంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాటి దీక్షను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు.

Updated Date - 2023-09-23T00:38:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising