సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2023-07-21T00:58:04+05:30
అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని వీఆర్ ఏల మండల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరాహారదీక్ష చేపట్టారు.
ఉయ్యూరు, జూలై 20: అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని వీఆర్ ఏల మండల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరాహారదీక్ష చేపట్టారు. వేతన సవరణ చేసి రద్దుచేసిన డీఏను పునరుద్దరించాలని సంఘం మండల అధ్యక్షుడు డి.ఏడుకొండలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు తెలుపుతామని బీజేపీ మం డల అధ్యక్షుడు కొండపల్లిరాజు హామీఇచ్చారు. సీఐటీయూ మండల కార్యదర్శి సజ్జ బాల గంగాధర్, ఏఐడీడబ్ల్యూఏ మండల కార్యదర్శి బి.కీర్తీ వీఆర్‌ఏల ఆందోళనకు మద్దతు పలి కారు. సులేమాన్‌రాజు, కె.రాజేశ్, సీహెచ్ జ్యోతి, కాటూరు వజ్రమ్మ పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T00:58:04+05:30 IST