సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2023-07-21T00:35:11+05:30
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద రిలేదీక్ష నిర్వహించారు.
తిరువూరు, జూలై 20: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద రిలేదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.పీహెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సరైన వేతనాలు సక్రమంగా అందించకుండా ప్రభుత్వం కార్మికులను పస్తులతో మాడుస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అందిస్తామని, కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామని వాగ్ధానం చేసిన జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికుల సమస్యలు పట్టించుకోకపోగా అదనపు పనిభారం మోపుతున్నారని ఆరోపించారు.దీక్షలో సీఐటీయూ నాయకులు ఎస్.వి.భద్రం, ఆకుల రవి, నాగరాజు, సామ్రాజ్యం, కృష్ణవేణి, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.
జగ్గయ్యపేటలో..
మునిసిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పాత మునిసిపల్ కార్యాలయం వద్ద రిలే దీక్షలను ప్రారంభించారు. సీపీఎం నాయకురాలు సోమోజు నాగమణి, షేక్ గౌస్‌మియా, రామనాథం, కోట కృష్ణ, దంతాల వెంకటేశ్వర్లు, పార ఎలకమ్మ, కంది రంగమ్మ, రోశమ్మ, నాగులు, రమణ, శ్రీదేవి, గురవమ్మ, బుజ్జి పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T00:35:11+05:30 IST