ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ కోతలు మొదలు

ABN, First Publish Date - 2023-04-03T00:34:51+05:30

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : వేసవి విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయి. నగరం, పట్టణాల్లో ఎలాంటి కోతలు లేకపోయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కోతలు అమలు చేస్తున్నారు. ఈ కోతలకు సంబంధించి విద్యుత్‌ శాఖ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అనధికారికంగా మాత్రం అమలు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అప్రకటిత కోతలతో ఇబ్బందులు

2-3 గంటల పాటు సరఫరా బంద్‌

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : వేసవి విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయి. నగరం, పట్టణాల్లో ఎలాంటి కోతలు లేకపోయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కోతలు అమలు చేస్తున్నారు. ఈ కోతలకు సంబంధించి విద్యుత్‌ శాఖ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అనధికారికంగా మాత్రం అమలు చేస్తున్నారు. విజయవాడలో ప్రస్తుతం ఎలాంటి కోతలు లేవు. మైలవరంలో కొద్దిరోజులుగా విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం అమలు చేస్తున్నారు. అయితే, వీటిని అమలు చేయడానికి నిర్దిష్ట సమయాలేమీ ఉండట్లేదు. రోజులో ఏదో ఒక సమయంలో విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేస్తున్నారు. గడిచిన కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం మూడు, నాలుగు గంటల నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఆకాశం మేఘావృతమై చల్లబడుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఏసీలు, ఫ్యాన్లకు పనిచెబుతున్నారు. దీంతో విద్యుత్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో నగరాలు, పట్టణాలకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో కోతలు విధిస్తున్నారని తెలుస్తోంది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ కోతలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వినియోగదారుల్లో కనిపిస్తోంది.

Updated Date - 2023-04-03T00:34:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising