మృతదేహంతో పోలుకొండలో ఆందోళన
ABN, First Publish Date - 2023-08-22T01:15:10+05:30
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో గ్రామస్థులు పోలుకొండలో ఆందోళనకు దిగారు. పోలుకొండ గ్రామానికి చెందిన జవ్వాది ఫణిబాబు (37)ను అంకన్నగూడెం వద్ద రెండు రోజుల క్రితం బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
నందివాడ (పోలుకొండ) : మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో గ్రామస్థులు పోలుకొండలో ఆందోళనకు దిగారు. పోలుకొండ గ్రామానికి చెందిన జవ్వాది ఫణిబాబు (37)ను అంకన్నగూడెం వద్ద రెండు రోజుల క్రితం బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గుడివాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మె రుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా ఆదివారం మార్గమధ్యంలో మరణించాడు. ఎస్సై శిరీష కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆర్యవైశ్య సంఘం నాయకులంతా మృతుడి కు టుంబసభ్యులకు మద్దతుగా నిలిచి న్యాయం చేయాలంటూ సోమవారం రాత్రి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఐ గోవిందరాజులు, ఎస్సై పోలీసు సిబ్బంది ఆర్యవైశ్య నాయకులతో మాట్లాడినా చర్చలు ఫలించలేదు. మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పోలుకొండ వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు.
Updated Date - 2023-08-22T01:15:10+05:30 IST