ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జరుగువానిపాలెం గ్రామస్థుల ఆందోళన

ABN, First Publish Date - 2023-03-02T00:48:48+05:30

మంచినీటి చెరువు నుంచి తాగునీటి సరఫరాకు చిన్న పైపులను వేయడాన్ని నిరసిస్తూ జరుగువానిపాలెం గ్రామస్థులు బుధవారం ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కోడూరు, మార్చి 1 : మంచినీటి చెరువు నుంచి తాగునీటి సరఫరాకు చిన్న పైపులను వేయడాన్ని నిరసిస్తూ జరుగువానిపాలెం గ్రామస్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో పైపులను తొలగించి కొత్త పైపులు వేసే విధంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రణాళిక రూపొందించారు. గతంలో ఉన్న పైపుల కంటే చిన్న సైజు పైపులను తీసుకొచ్చి చెరువు వద్ద ఉంచారు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు బుధవారం మం చినీటి చెరువు వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. గతంలో కంటే చిన్న పైపులు వేయడాన్ని ఆక్షేపించారు. పెద్ద పైపులను వేయాలని, లేదా గతంలో ఉన్న పైపులనే వేయాలని డిమాండ్‌ చేశారు. జనాభా పెరుగుతున్న క్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అందించే మంచినీరు సరిపోవటం లేదని, పైపులైన్‌ సైజు పెంచి మంచినీరు అందించాలని కోరామన్నారు. అప్పికట్ల రవీంద్ర, యర్రంశెట్టి దామోదర్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!