సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సేవలో మంత్రి పెద్దిరెడ్డి
ABN, First Publish Date - 2023-06-07T01:27:43+05:30
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.
మోపిదేవి, జూన్ 6 : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చక బృందం ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నాగపుట్టలో పాలుపోసి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. అర్చక బృందం వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.ఎ్‌స.చక్రధరరావు, ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు మంత్రి పెద్దిరెడ్డికి అందజేశారు.
Updated Date - 2023-06-07T01:27:43+05:30 IST