ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్‌ఎ్‌సఎల్‌వీ-19 విజయవంతం

ABN, First Publish Date - 2023-06-26T02:03:10+05:30

తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎన్‌ఎ్‌సఎల్‌వీ-19 హై ఆల్టిట్యూడ్‌ బెలూన్‌ శాట్‌ ప్రయోగించి విజయవంతం చేశారు.

అంతరిక్షంలోకి పంపుతున్న బెలూన్‌ శాట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు, జూన్‌ 25 : తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎన్‌ఎ్‌సఎల్‌వీ-19 హై ఆల్టిట్యూడ్‌ బెలూన్‌ శాట్‌ ప్రయోగించి విజయవంతం చేశారు. చెన్నైకి చెందిన స్పేస్‌ కిడ్స్‌ ఇండియా, ఉషారామా ఇంజనీరింగ్‌ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సుంకర అక్షయ్‌ పర్యవేక్షణలో కళాశాల విద్యార్థులు బెలూన్‌ శాటిలైట్‌ను రూపొందించి కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఆవిష్కరించారు. ఉదయం గం.10.30లకు బెలూన్‌ శాటిలైట్‌ను నింగిలోకి పంపారు. సుమారు 25కిలోమీటర్లమేర ఎత్తులో అక్కడి వాతావరణ పరిస్ధితులను అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని కళాశాల యాజమాన్యం తెలిపింది. సుమారు 3గంటల పాటు అంతరిక్షంలో వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేసిన బెలూన్‌ శాటిలైట్‌ దానికి అమర్చిన సెన్సార్లు, కెమెరాల ద్వారా డేటాను కంట్రోల్‌ స్టేషన్‌కు పంపి అమరావతిలోని నెక్కల్లు గ్రామంలో మధ్యాహ్నం 1.40గంటలకు భూమిపై ల్యాండ్‌ అయినట్టు కళాశాల చైౖర్మన్‌ సుంకర రామబ్రహ్మం తెలిపారు. ఈసందర్భంగా జరిగిన సభలో డీఆర్‌డీవో ఆర్‌డీఐ పి.అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ, అంతరిక్ష పరిశోధనలపై ఇంజనీరింగ్‌ అవగాహన కల్పించడంతోపాటు సృజనాత్మక ఆలోచనలకు పదునుబెట్టి నూతన ఆవిష్కరణలు రూపొందించడంలో తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్‌ కళాశాల కృషి అభినందనీయమన్నారు. చదువుతోపాటు సమాజానికి ఉపయోగపడే ఇలాంటివి మరిన్ని ఆవిష్కరించాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల కరస్పాండెంట్‌ సుంకర అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి అబ్దుల్‌కలాం వంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జేఎన్‌టీయూ కాకినాడ డీఈ బి.బాలకృష్ణ మాట్లాడుతూ, అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి ఈ ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏవీఎస్‌ అకాడమి(యుఎ్‌సఏ)డైరెక్టర్‌ కిరణ్‌ పల్లా, స్పేస్‌ కిడ్స్‌ ఇండియా(చెన్నై)సీఈవో కేశన్‌, బెలూన్‌ శాటిలైట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సుంకర అక్షయ్‌, ఏపీ ఫైబర్‌నెట్‌ చైౖర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T02:03:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising