సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంతో వర్తించని బీమా
ABN, First Publish Date - 2023-05-17T00:38:09+05:30
గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బాధిత కుటుంబాలకు వైఎస్‌ఆర్ బీమా వర్తించడం లేదని జడ్పీటీసీ సభ్యుడు కోటా శ్యామ్యేలు అన్నారు.
గంపలగూడెం, మే 16: గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బాధిత కుటుంబాలకు వైఎస్‌ఆర్ బీమా వర్తించడం లేదని జడ్పీటీసీ సభ్యుడు కోటా శ్యామ్యేలు అన్నారు. ఎంపీపీ గోగులమూడి శ్రీలక్ష్మి అధ్యక్షతన మండల సమావేశం మంగళవారం జరిగింది. ఎంపీపీ మాట్లా డుతూ కొణిజర్లలో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి బీమా అందకపోవ డానికి కారణం వలంటీర్ అతను జీవించి ఉండగా వేలిముద్రలు తీసుకోలేదన్నారు. గత ఏడాది సైతం ఇదే విఽధంగా నెమలిలోను ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. ఇలాంటివి ఇకపై జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆసరా నగదు బ్యాంకులో జమ కాలేదని దుందిరాలపాడు సర్పంచ్ బంకా బాబురావు అన్నారు. పక్కా గృహాలు నిర్మించుకునేందుకు ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని సర్పంచ్ దుబ్బాకు రామకృష్ణ అన్నారు. శ్మశానవాటికల్లో నాలుగు బోర్ల నిర్మాణానికి జిల్లా, మండల పరిషత్ నుంచి నిధులు మంజూరు చేయాలని చింతలనర్వ గ్రామ సర్పంచ్ గద్దల జాన్ కోటయ్య కోరారు. సమావేశంలో ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి, ఇరిగేషన్ ఏఈ కిషోర్, ఏవో బి.సాయిశ్రీ, హౌసింగ్ ఏఈ కిషోర్, సాయికృష్ణ, స్వామి నాయక్ పాల్గొన్నారు.
Updated Date - 2023-05-17T00:38:09+05:30 IST