వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవళింపు సేవ
ABN, First Publish Date - 2023-01-31T01:17:13+05:30
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు స్వామివారి పవళింపు సేవతో వైభవంగా ముగిశాయి. ప్రత్యేక అలంకరణ గావించిన సింహాసనంపై స్వామి, అమ్మవార్ల పవళింపు సేవా కార్యక్రమాన్ని వేదపండితులు జరిపారు.
మోపిదేవి : మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు స్వామివారి పవళింపు సేవతో వైభవంగా ముగిశాయి. ప్రత్యేక అలంకరణ గావించిన సింహాసనంపై స్వామి, అమ్మవార్ల పవళింపు సేవా కార్యక్రమాన్ని వేదపండితులు జరిపారు. ఈవో ఎన్.చక్రధరరరావు ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు సత్యనారాయణ, ఆలయ ఉద్యోగులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
Updated Date - 2023-01-31T01:17:15+05:30 IST