సైకోను దించి సైకిల్‌ను గద్దెనెక్కిద్దాం
ABN, First Publish Date - 2023-01-15T01:06:46+05:30
జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేర ని, వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని టీడీ పీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు అన్నారు.
విద్యాధరపురం, జనవరి 14 : జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేర ని, వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని టీడీ పీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు అన్నారు. భోగి పండుగను పురస్కరించుకుని శనివారం టీ డీపీ జిల్లా కార్యాలయం వద్ద శనివారం భోగిమంటలు వేశారు. ఈ మంటల్లో జీవో-1 ప్ర తులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ధరలు పెరిగాయని, పన్నుల భారం నడ్డి విరుస్తోందన్నారు. ఉపాధి లేక ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితి లేదన్నారు. వైసీపీ పాలనతో విసుగు చెందిన ప్రజలు సైకో పాలన పోవాలని, సైకిల్‌ను గద్దె నెక్కించాలని వేచి చూ స్తున్నారన్నారు. చీకటి జీవో 1ను తెచ్చి ప్రతిపక్షాలను అణివేసేందుకు కుట్ర పన్నారని, అందుకే వాటిని దహనం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేయడం జరుగుతుందని, అందుకే పనికిరాని జీవో 1 ప్రతులను దహనం చేశామన్నారు. మాఫియా గ్యాంగులతో చీకటి పాలన నడుస్తోందని, గంజాయి విక్రయాలు, కల్తీ మద్యం, మత్తు పదార్థాలన్నీ సైకో పాలనలోనే ఉన్నాయన్నారు. సైకిల్ పాలన రావాలనే ధ్యేయంతో పనిచేస్తామని తామంతా ఈవేళ అగ్ని దేవుడి సాక్షిగా ప్రతిజ్ఞ చేశామన్నారు. గొల్లపూడి నాగేశ్వరరావు, జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, ఎస్ ఫిరోజ్, చెన్నుపాటి గాంధీ, ఇస్త్రం దానియేలు, రత్నం రమేష్, పలువురు నేతలు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-15T01:06:47+05:30 IST