ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-15T15:07:26+05:30

టీడీపీ ఎంపీ (TDP MP) కేశినేని నాని (Keshineni Nani) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన జరగాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ ఎంపీ (TDP MP) కేశినేని నాని (Keshineni Nani) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన జరగాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నందిగామలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తమ్ముడికి సీటు ఇస్తే చచ్చినా మద్దతు ఇవ్వబోనంటూ ప్రకటించారు. టీడీపీలో ముగ్గురు నేతలు ఉన్నారని, వారికి సీట్లు ఇస్తే పార్టీలో పనిచేయబోనని పరోక్షంగా విజయవాడ టీడీపీ నేతలపై కామెంట్ చేశారు. చీటర్లు, రియల్ ఎస్టేట్ మోసాలు చేసిన వారు, సెక్స్ వర్కర్లు, కాల్ మనీ గాళ్ళకు టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వనన్నారు. తన తమ్ముడు యాక్టివ్‌గా ఉంటే ఆయన వెంటే తనను తిరగమంటే తానెందుకు తిరుగుతానని ప్రశ్నించారు. తనకు క్యారెక్టర్ ఉందని, రాజకీయాల్లో ఎవరినీ మోసం చేయడానికి రాలేదని చెప్పారు. ఎన్నికల్లో దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ లాంటి 420 గాళ్లు కూడా పోటీ చేసే హక్కు ఉంటుందని.. అంతమాత్రాన వాళ్లకు మద్దతు ఇవ్వమంటే తాను ఇవ్వలేనని కేశినేని నాని స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-15T15:07:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising