సెంట్రల్‌లో పోలింగ్‌స్టేషన్ల పరిశీలన
ABN, First Publish Date - 2023-09-22T00:25:20+05:30
నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నమోదు అధికారి స్వప్నిల్ దినకర్ గురువారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
సెంట్రల్‌లో పోలింగ్‌స్టేషన్ల పరిశీలన
సత్యనారాయణపురం, సెప్టెంబరు 21: నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నమోదు అధికారి స్వప్నిల్ దినకర్ గురువారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ కోర్టు వెనుక ఉన్న రైల్వే కమ్యూనిటీ హాలు పోలింగ్‌స్టేషన్‌లో అవసరమైన మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ఓటర్లు, ఎన్నికల సిబ్బంది భద్రతపై ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఓటర్లు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాలు, సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో మరమ్మతులు ఉంటే సంబంధిత ఏఈల దృష్టికి తెచ్చి పరిష్కరించాలని ఆదేశించారు.
Updated Date - 2023-09-22T00:25:20+05:30 IST