ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయ పాల ధర మళ్లీ పెంపు

ABN, First Publish Date - 2023-02-28T00:52:09+05:30

పాల వినియోగదారులపై మళ్లీ భారం పెరిగింది. విజయ పాల ధరను పెంచుతూ కృష్ణామిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రేపటి నుంచి అమల్లోకి..

చిట్టినగర్‌, ఫిబ్రవరి 27 : పాల వినియోగదారులపై మళ్లీ భారం పెరిగింది. విజయ పాల ధరను పెంచుతూ కృష్ణామిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. విజయ డెయిరీ ఆరు కేటగిరీల్లో పాలను ఉత్పత్తి చేస్తోంది. వాటి ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. విజయ లోఫాట్‌ (డీటీఎం) లీటర్‌ పాల ధర రూ.52 ఉండగా, తాజాగా దాన్ని రూ.54కు పెంచారు. విజయ ఎకానమీ (టీఎం) లీటర్‌ రూ.56 ఉండగా, రూ.58కు, విజయ ప్రీమియం (స్టాండర్డ్‌) లీటర్‌ రూ.60 ఉండగా, రూ.62కు, విజయ స్పెషల్‌ (ఫుల్‌క్రీమ్‌) పాలు లీటర్‌ ధర రూ.70 నుంచి రూ.72కు పెంచారు. విజయ గోల్డ్‌ పాలు లీటర్‌ రూ.72 ఉండగా, రూ.74కు, విజయ టీ-మేట్‌ లీటర్‌ రూ.66 ఉండగా, రూ.68గా పెంచారు. దేశంలో అన్ని యూనియన్లు రేట్లను పెంచడం జరిగిందని, కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారులకు చెల్లిస్తున్న పాల సేకరణ ధర, డీజిల్‌ తద్వారా రవాణా ఖర్చులు, ప్యాకింగ్‌ మెటీరియల్‌, ఇతర వ్యయాలు, అసాధారణంగా పెరిగినందున అనివార్య పరిస్థితుల్లో పాలు, పాల ఉత్పత్తుల గరిష్ట విక్రయ ధరలను స్వల్పంగా సవరించామని, పెరిగిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని, సవరించిన ఈ పాల విక్రయ ధరలను విజయ రిటైలర్లు, వినియోగదారులు గమనించి ఎప్పటిలాగే పాడి రైతుల సంస్థ అభివృద్ధికి సహకరించాలని యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు కోరారు. నెలవారీ పాలకార్డు కొన్న వారికి మార్చి 9 తేదీ వరకు పాత ధరలు వర్తిస్తాయని తెలిపారు.

Updated Date - 2023-02-28T00:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!